Share News

ఎమ్మెల్యే గారూ.. ఇటు వైపు కూడా చూడండి

ABN , Publish Date - Oct 18 , 2024 | 10:57 PM

ఎమ్మెల్యే మేడం గారూ.. ఈపక్క కూడా ఒక్కసారి దృష్టి సారించండి.

ఎమ్మెల్యే గారూ.. ఇటు వైపు కూడా చూడండి
హోమియోపతి కళాశాలకు వెళ్లే రోడ్డు దుస్థితి

కడప ఎడ్యుకేషన, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) :మ్మెల్యే మేడం గారూ.. ఈపక్క కూడా ఒక్కసారి దృష్టి సారించండి. కడప కార్పొరేషనగా ఏర్పడక ముందు మేజరు పంచాయతీల్లో రా మరాజుపల్లె పంచాయతీ ఒకటి. గత పాలకు లు ఈ పంచాయతీపై పూర్తి వివక్ష చూపారు. కార్పొరేషనలో విలీనం అయిన తరువాత రా మరాజుపల్లె పంచాయతీ 48వ డివిజనులోకి చేరింది. ఇక్కడున్న ప్రజానీకమంతా పేద బడుగు, బలహీన వర్గాలే అని చెప్పాలి. గత పదిసంవత్సరాల నుంచి హోమియోపతి కళాశాల ప్రాంతం విస్తరిస్తోంది. అయితే కార్పొరేషన అధికారులకు వారికి రావాలసిన ఫీజులు, పన్నులు వసూలు చేసుకుంటున్నారు కానీ వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ డివిజనపై ప్రధానంగా హోమియోపతి కళాశాల రోడ్డుపై దృష్టి సారించి స మస్యలు పరిష్కరిస్తారనుకుంటే కడప ఎమ్మె ల్యే మేడం మాత్రం ఇంత వరకు ఈ ప్రాం తంలో పర్యటించిన దాఖలాలు లేవు. ఎంత సేపు టౌన ప్రాంతాల్లో, పాతకడప ప్రాంతాల్లో మాత్రమే పర్యటిస్తుంటారు. ఈ ప్రాంతంలో పర్యటిస్తే ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయి కదా అని ప్రజలు అనుకుంటున్నారు.ఎమ్మెల్యే మేడం.. స్పందించి దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు.

చినుకుపడితే రాకపోకలు బంద్‌

48వ డివిజనులో రామాంజనేయనగర్‌, సనసిటి, ఏఎ్‌సఆర్‌ నగర్‌, ఆచారి కాలనీ, చెంచుకాలనీవాసులకు హోమియోపతి కళాశాల రోడ్డు ప్రధానమైనదని చెప్పాలి. వీరు ఎక్కడికి వెళ్లాలన్నా ఈ రోడ్డు మార్గం గుండానే వెళ్లాలి. అయితే చిన్నపాటి వర్షం వచ్చిందంటే ఈ రోడ్డు పూర్తిగా జలమయం అవుతుంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు తప్పడంలేదు. తుఫాను కారణంగా గత మూడురోజుల నుంచి కురిసిన వర్షాలకు రోడ్డుపై మోకాలిలోతు నీరు నిల్వడంతో పాదచారులతో పాటు బైకులు సైతం నీటిలో వెళ్లలేక మధ్యలోనే ఇంజను డెడ్‌ అయిన పరిస్థితి నెలకొంది. పాదచారుల పరిస్థితి అయితే వర్ణనాతీతమని చెప్పాలి. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.

అస్తవ్యస్తంగా కాల్వ నిర్మాణం

ఎన్నికల కోడ్‌ వెలువడక ముందు వైసీపీ నాయకులు హడావుడిగా కొత్త నిర్మాణాలు, అ భివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగా హోమియోపతి కళాశాల రోడ్డులో కాల్వ నిర్మించారు. అయితే ఈ నిర్మాణం మా త్రం ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని చె ప్పాలి. రోడ్డుకు రెండు అడుగుల ఎత్తులో కా ల్వ నిర్మాణం చేశారు. దీంతో వర్షం నీరు కాల్వలోకి వెళ్లే మార్గం లేదు. గతంలో అయితే కాల్వ లేకపోవడంతో వర్షం నీరు రోడ్డుపై లేకుండా దిగువ ప్రాంతానికి వెళ్లేది. ఇప్పుడు వర్షం నీరు వెళ్లే మార్గమే లేకపోవడంతో రో డ్డంతా జలమయం అవుతోంది. అలాగే రోడ్డు నిర్మాణం కూడా అక్రమమేనని చెప్పాలి. రా మాంజనేయనగర్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వారి వ్యాపారం కోసం రామాంజనేయనగర్‌ నుండి పరమేశ్వర స్కూలు వరకు వారి సొంత నిధులతో కాల్వ నిర్మాణం చేశారు. వైసీపీ నాయకులు ఆ నిర్మాణ పనులను పరమేశ్వర స్కూలు నుంచి మెయినరోడ్డు వరకు అశాస్త్రీయ పద్ధతిలో అస్తవ్యస్తంగా నిర్మాణం చేసి నిధులు మాత్రం దోచుకున్నారని విమర్శలున్నాయి. దీనిపై కూడా విచారణ చేపట్టి డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

పోయే దారిలేక కదలని మురుగు

హోమియోపతి కళాశాల రోడ్డు సనసిటి ఎదురుగా కాల్వనిర్మాణం జరగలేదు. పారిశుధ్యం కూడా అధ్వాన్నంగా తయారైంది. దీంతో మురుగు ముందుకు కదలడంలేదు. అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోడంతో పెద్దఎత్తున చెత్త మురుగుకాల్వల్లో పేరుకుపోతుంది. కాల్వ నిర్మాణం చేపట్టినట్లయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.

రోడ్లపై పేరుకుపోతున్న చెత్త

48వ డివిజన అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడ బహుళ అంతస్తులు గృహ నిర్మాణాలు వెలిశాయి. అయితే ఈ ఖాళీ ప్రాంతాలు చెత్తకు అవాసంగా మారాయి. కార్పొరేషన సిబ్బంది సైతం చెత్త వేసి వెళుతున్నారు. ఈ ప్రదేశం రోగాలకు ఆవాసంగా మారింది.

ఇళ్ల మధ్యలో మురుగు

రామాంజనేయనగర్‌, సనసిటి ప్రాంతాల్లో ఇళ్ల మధ్య నిల్వ ఉంటున్న మురుగుతో ప్రజలు అల్లాడుతున్నారు.ఇళ్ల మధ్య అక్కడక్కడా ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ స్థలాలపై యజమానుల పర్యవేక్షణ లేకపోవడంతో అవి డం పింగ్‌ యార్డులుగా మారాయి. దీనికి తోడు వర్షం నీరు ఖాళీస్థలాల్లో నిలిచి మురుగుగుంతలుగా మారాయి. వాటిలో పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరుగుతున్నాయి. అంతటితో ఆగక వాడేసిన కొబ్బరిబొండాలు, ఎండిన ప్లాస్టిక్‌ సామగ్రి లాంటివి పారవేస్తున్నారు. వర్షాలు కురవగానే వాటిలో నీరు చేరడంతో దోమలు ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దీంతో ప్రమాదకర డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధులు ప్రబలుతాయనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఖాళీ స్థలాల యజమానులకు తమ ప్లాట్లను ఎత్తు చేసుకోవాలని కార్పొరేషన అధికారులు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అఽధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Oct 18 , 2024 | 10:58 PM