Share News

ఇంజినీర్లకు మార్గదర్శకుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:33 PM

దేశం లోని ఇంజినీర్లకు మోక్షగుండం విశ్వేశ్వ రయ్య మార్గదర్శకుడని రిటైర్ట్‌ చీఫ్‌ ఇంజి నీర్‌ హరినారాయణరెడ్డి పేర్కొన్నారు.

ఇంజినీర్లకు మార్గదర్శకుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య
కురబలకోటలో మోక్షగుండం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

మదనపల్లె టౌన, సెప్టెంబరు 15: దేశం లోని ఇంజినీర్లకు మోక్షగుండం విశ్వేశ్వ రయ్య మార్గదర్శకుడని రిటైర్ట్‌ చీఫ్‌ ఇంజి నీర్‌ హరినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పంచాయతీరాజ్‌ కార్యాలయం వద్ద జాతీయ ఇంజినీర్స్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి ఇరిగేషన రిటైర్డ్‌ చీఫ్‌ ఇం జినీర్‌ హరినారాయణరెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర మూలాలు ఉన్న విశ్వేశ్వరయ్య కర్ణాటకలో పుట్టి, పెరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ మీద మమకారంతో హైదరాబాద్‌లో మూసి నది మునక ప్రాంతాలకు రక్షణగా సివిల్‌ ఇంజినీరింగ్‌తో నిర్మాణాలు చేపట్టారన్నారు. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డుకు డిజైన చేసిన విశ్వేశ్వరయ్య ఈ నాటికి, ఆ దారి చెక్కు చెదరకుండా ఉందంటే అది ఆయన ఉపయోగించిన పరిజ్ఞానమే అన్నారు. పంచాయతీరాజ్‌ రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ అమరనాథరెడ్డి మాట్లాడుతూ ఇంజినీర్‌గా పేరుప్రఖ్యాతులు పొందిన మోక్షగుం డం విశ్వేశ్వరయ్య సివిల్‌ ఇంజినీర్లకు ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం పలువురు ఇంజినీర్లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహానబాషా తనయుడు జునైద్‌ అక్బారి, హెచఎనఎస్‌ఎస్‌ ఎస్‌ఈ రాజగోపాల్‌, ఎస్పీడీసీఎల్‌ ఈఈ గంగాధర్‌, చంద్రశేఖర్‌, సఫావుల్లా, డేవిడ్‌ సంజయ్‌, రమేశ రెడ్డి, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

కురబలకోటలో: ఇంజినీరింగ్‌ రంగంలో సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయ మని పీఆర్‌ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ అమరనాధరెడ్డి, మాజీ డీఈ సాయి ప్రసాద్‌లు పేర్కొన్నారు. ఆది వారం మండలంలోని అంగళ్లు సమీపంలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీర్స్‌ డేని పురస్కరిం చుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సంద ర్భంగా ఇంజనీరింగ్‌ రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీన తులసీరామ్‌ నాయుడు, వైస్‌ ప్రిన్సిపాల్‌ కమాల్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:33 PM