Share News

కడప- బెంగుళూరు రైల్వేలైన్‌ ఏర్పాటుపై ఉద్యమించాలి

ABN , Publish Date - Jan 29 , 2024 | 10:14 PM

కడప- బెంగుళూరు రైల్వేలైన్‌పై ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు పిలుపునిచ్చారు

కడప- బెంగుళూరు రైల్వేలైన్‌ ఏర్పాటుపై ఉద్యమించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు

రాయచోటిటౌన్‌, జనవరి29: కడప- బెంగుళూరు రైల్వేలైన్‌పై ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు పిలుపునిచ్చారు. సోమవారం రాయచోటి మండల పరిషత్‌ కార్యాలయ సభా భవనంలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప- బెంగుళూరు రైల్వేలైన్‌ పాత అలైన్మెంట్‌ ప్రకారం ఏర్పాటు చేస్తే రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందన్నారు. నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం లో ఒక పరిశ్రమ కూడా లేకపోవడంతో యువత గల్ఫ్‌ దేశాలకు వెళుతోందన్నారు. చిన్నమండెం, సంబేపల్లె ప్రాంతంలో టమోటా జ్యూస్‌, ఎర్ర చందనం ఆధారిత పరిశ్రమలు, కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. వెలిగల్లు, ఝరికోన, శ్రీనివాసపురం రిజర్వాయర్‌ కాలువలు పూర్తి చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పుల్లయ్య, బత్తల వెంకట్రమణ, రమణ, అనిల్‌, సురేంద్ర, మహిళా సంఘం నాయకురాళ్లు అరుణ, ఆదెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 10:14 PM