Share News

Kadapa: విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ పీఏ

ABN , Publish Date - Dec 09 , 2024 | 01:35 PM

Andhrapradesh: ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియా పోస్టులపై అరెస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డి విచారణలో రాఘవరెడ్డి పేరు చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్‌ నుంచి కంటెంట్ అంతా రాఘవరెడ్డి వాట్సప్‌ నుంచి వచ్చిందని వర్రా వాంగ్మూలం ఇచ్చారు.

Kadapa: విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ పీఏ
MP Avinash Reddy PA

కడప, డిసెంబర్ 9: కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) పీఏ రాఘవరెడ్డి (PA Raghava reddy) విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియా పోస్టులపై కడప సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై అరెస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డి విచారణలో రాఘవరెడ్డి పేరు చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్‌ నుంచి కంటెంట్ అంతా రాఘవరెడ్డి వాట్సప్‌ నుంచి వచ్చిందని వర్రా వాంగ్మూలం ఇచ్చారు. దీంతో రాఘవరెడ్డి కోసం పోలీసులు నెల రోజులుగా గాలిస్తున్నారు. ఈనెల 12 వరకు అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి రాఘవరెడ్డి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులకు వచ్చిన రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Home Minister Anitha: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు..


వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించి పోలీసుల కేసులు, నోటీసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈయనపై నెల రోజుల క్రితమే కేసు నమోదు అయ్యింది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి వైసీపీ నేత వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో రాఘవరెడ్డి పేరు ప్రస్తావించారు. తాను సొంతంగా పోస్టులు పెట్టలేదని, ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి ఆయన పీఏ రాఘవరెడ్డి కంటెంట్ ఇస్తేనే పోస్టు చేసినట్లు విచారణలో తెలిపారు. ఈ క్రమంలో ఎంపీ పీఏపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గత నెలరోజులుగా రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు.

Minister Satyaprasad: జగన్ లాగా చేయడం ఎవరికి సాధ్యం కాదు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ విసుర్లు


అయితే ఈనెల 12 వరకు అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని నిన్న(ఆదివారం) రాఘవరెడ్డి పులివెందులకు వచ్చారు. రాఘవరెడ్డి వచ్చిన వెంటనే ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అరెస్ట్ ఉండదని.. కేవలం విచారణ మాత్రమే... అందుకోసం కడప సైబర్ క్రైమ్ ఆఫీసుకు రావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం రాఘవరెడ్డి విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. రాఘవరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఎంపీ అవినాష్ కార్యాలయం నుంచి ఎవరెవరు పోస్టులు చేశారు.. ఎంపీ అవినాష్ చెబితేనే చేశారా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రాఘవరెడ్డి చెప్పిన ప్రకారం వైఎస్ షర్మిల, సునీత, విజయమ్మపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టామని.. అలాగే సీఎం చంద్రబాబు, పవన్‌పై కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు వర్రా రవీంద్రారెడ్డి విచారణలో తెలిపారు. ఈ అంశాలపై రాఘవరెడ్డిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం కీలక ప్రకటన.

జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 10:51 AM