అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Apr 14 , 2024 | 10:38 PM
రాజంపేట అగ్నిమాపక కేంద్ర ఆవరణంలో ఆదివారం ఆర్డీవో టి.మోహనరావు అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభిం చారు. అనంతరం అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాజంపేట టౌన, ఏప్రిల్ 14: రాజంపేట అగ్నిమాపక కేంద్ర ఆవరణంలో ఆదివారం ఆర్డీవో టి.మోహనరావు అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభిం చారు. అనంతరం అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్ర మాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతమైన చర్యలు ప్రశంసనీయమన్నారు. అగ్నిమాపక అధికారి మాబూసుభాన మాట్లాడుతూ ఈ అగ్నిమాపక వారోత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయని, పెట్రోలు, బంకులు, పాఠశాలలు, అపార్టుమెంటులు పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తామన్నారు.
లక్కిరెడ్డిపల్లె: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఎస్‌ఐ విష్ణువర్ధన్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆధివారం స్థానిక పైర్‌స్టేషన్ లో అవగాహన సదస్సు ఏర్పాటుచేసి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఫైౖర్‌ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు పెట్రోల్ బంకులు, పాఠశాలలు, జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామ న్నారు. ఎక్కడైన అగ్నిప్రమాదాలు జరిగితే 08567-234199 నెంబరుకు పోన్ చేస్తే వెంటనే వచ్చి మంటలను అదుపుచేస్తావన్నారు.ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పపాల్గొన్నారు.