Share News

చివరి ఆయకట్టు వరకూ నీరందేలా కృషిచేయాలి

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:07 AM

నీటి సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష, సభ్యులుగా ఎన్నికైన వారంతా బాధ్యతగా పనిచేయాలని, చివరి ఆయకట్టు వరకూ నీరందేలా కృషిచేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి సూచించారు.

చివరి ఆయకట్టు వరకూ నీరందేలా కృషిచేయాలి
నీటి సంఘం అధ్యక్షులతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

- టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

చెన్నూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): నీటి సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష, సభ్యులుగా ఎన్నికైన వారంతా బాధ్యతగా పనిచేయాలని, చివరి ఆయకట్టు వరకూ నీరందేలా కృషిచేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి సూచించారు. శనివారం చెన్నూరు, చిన్నమాచుపల్లి, ఆలంఖానపల్లె నీటి సంఽఘం అధ్యక్షులుగా ఎన్నికైన వారంతా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీ కెనాల్‌ చివరి ఆయకట్టు వరకూ ప్రతీ ఎకరాకు నీరు అందేలా కృషి చేయాలన్నారు. అలాంటప్పుడే పదవికి సార్థకత ఉంటుందన్నారు. మండల కన్వీనర్‌ కె.విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన ఐ.శివారెడ్డి ఆధ్వర్యంలో నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం అభినందనీయమన్నారు. చెన్నూరుకు అధ్యక్షుడిగా గోదిన శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా ముండ్ల హరింద్రారెడ్డి, చిన్నమాచుపల్లెకు ఆవుల శంకర్‌రెడ్డి, మునిసుబ్బారెడ్డి, ఆలంఖానపల్లెకు అధ్యక్షుడిగా తాడిగొట్ల వెంకటసుబ్బారెడ్డి, (బుజ్జన్న), ఉపాధ్యక్షుడిగా నాగం జగనమోహనరెడ్డి ఎన్నికయ్యారు.

Updated Date - Dec 15 , 2024 | 12:07 AM