గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించాలి
ABN , Publish Date - Nov 04 , 2024 | 11:39 PM
గ్రామాల్లో అభివృద్ధి పనులకు అధికారులు సహకరించాల ని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కు మార్‌రెడ్డి పేర్కొన్నారు.
అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి
గుర్రంకొండ/వాల్మీకిపురం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి):గ్రామాల్లో అభివృద్ధి పనులకు అధికారులు సహకరించాల ని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కు మార్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరి షత కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్య లైన సీసీరోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, వీధిలైట్ల పరిష్కారానికి నాయకుల సమన్వయంతో పనిచేయాలని సూచించా రు. అనంతరం చెర్లోపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లెలో ఎంపీటీసీ రెడ్డిప్రసాద్‌నాయుడు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించారు. కార్యక్రమంలో నాయకులు జగదీష్ కుమార్, మూర్తిరావు, నౌషాద్, చలమారెడ్డి, ఎల్లుట్ల మురళీ, సుంకర శేఖర్, ప్రదీప్, ఆనం ద్, బయ్యారెడ్డి, చంద్రబాబు, నౌషాద్‌అలీ, సుధాకర్, ఎంపీడీవో వెంకటేశులు, తహశీల్దార్ శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కాగా వాల్మీకిపురం మం డలంలో ఎక్కడా ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిగా అందే దిశగా అధికారులు పనిచేయాలన్నారు. అనంతరం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. ఈకార్యక్రమాలలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన కంభం నిరంజనరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, గాంధీపేట రమణ, పీవీ నారాయణ, పీలేరు పార్టీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌బాషా, అధికారులు పాల్గొన్నారు. కాగా చింతపర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ కొండక్కగారి కేశవరెడ్డి వర్దంతి సందర్భంగా ఆయన సమాఽధి వద్ద ఎమ్మె ల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ మహి త శేషాద్రిరెడ్డి, కలకడ మాజీ జడ్పీటీసీ తిరుపతినాయుడు, నాయకులు జగన్నాథ రెడ్డి, నరసింహారెడ్డి, సత్యారెడ్డి, భాస్కర్‌రెడ్డి, హరినాథరెడ్డి, చంద్రారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.