గ్రామం ఒకటి.. పంచాయతీలు రెండు
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:29 PM
మండ లంలోని ఒక గ్రామం రెండు పంచాయతీలు కలి సి ఉండడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.
సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్న
వెంగళకురవపల్లి ప్రజలు
పనుల కోసం కిలోమీటర్లు వెళ్లాల్సి
వస్తోందంటున్న వైనం
ఉన్నతాధికారులకు సమస్యను
నివేధిస్తామంటున్న అధికారులు
నిమ్మనపల్లి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): మండ లంలోని ఒక గ్రామం రెండు పంచాయతీలు కలి సి ఉండడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. వెంగళకురవపల్లి గ్రామంలో దాదాపు 90 కుంటుబాల వారు జీవనం సాగిస్తు న్నారు. అయితే ఈ గ్రామం సగ భాగం నిమ్మ నపల్లి పంచాయతీకి, మరో సగభాగం వెంగంవా రిపల్లి పంచాయతీకి చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్థులు ఏ పనికావాలన్నా సు మారు ఆరు కిలోమీటర్లు గ్రామ పంచాయతీకి రావాల్సి ఉంటుంది. దీనికి తోడు వెంగళకురవపల్లి కొండల సమీపంలో ఉండడం, పంచాయతీలు వేరు కావ డంతో చిన్న పని కావాలంటే తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. ముఖ్యంగా రెండు రేషన షాపులు, భూములు అయితే ఒక గ్రామంలో ఉండి మరో గ్రామంలో నివాసం ఉంటే సమస్యలు వస్తున్నాయి. అంతే కాకుండా గ్రామ సభలు నిర్వహిం చినపుడు ఒక గ్రామంలోని ప్రజలు రెండు పంచాయతీలకు వెళ్లాల్సి రావడం. అదే విధంగా ఎన్నికల సమయంలో ప్రజలు రెండు పంచాయ తీలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వస్తుండడం భారంగా ఉంటోందన్నారు. దీనికి తోడు ఒకే గ్రామానికి రెండు దారులు ఉండండం గమనార్హం. కాగా గ్రామాన్ని ఒకే పంచాయతీ కిం దికి తీసుకొస్తే సనులు చేసుకొనేందుకు సులభత రంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.
ప్రజలు సమస్యను తెలియజేస్తే ఉన్నతాధికారులకు నివేధిస్తాం
గత కొన్నేళ్లుగా ఒకే గ్రామం రెండు పంచా యతీల్లో ఉందని ప్రజలు సమస్య ఉంటే తమ దృష్టికి తెస్తే వాటిని పరిశీలించి ఉన్నతాధికా రులకు నివేదిక పంపుతామని ఈవోపీఆర్‌డీ చలపతిరావు పేర్కొన్నారు. వెంగళకురవపల్లి గ్రామ సమస్యపై ‘ఆంధ్రజ్యోతి’ ఈవోపీఆర్డీని వివరణ కోరగా పై విధంగా స్పందించారు.
పనులు కావాలంటే నిమ్మనపల్లి వెళ్లాలి
కార్యాలయాల్లో పనులు జరగాలంటే దాదాపు ఏడు కిలోమీటర్లు ఉన్న నిమ్మనపల్లి వెళ్లాల్సి వస్తోంది. భూ సమస్యలపైనా రేషన కొరకు, ఇత ర పనుల కోసం నిత్యం తిరగాల్సిఉంది. సమస్య ను అధికారులు పరిష్కరించాలి.
-నారాయణ, గ్రామస్థుడు, నిమ్మనపలి
సచివాలయాలకు వెళ్లాలంటే సమస్యగా ఉంది
సచివాలయాలకు వెళ్లాలంటే ఇబ్బందులుపడుతున్నాం. రెండు సచివాలయాలు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో ఏదో ఒక పని మీద సచివాలయాలకు వెళ్లాల్సి రావడంతో కష్టాలు తప్పడంలేదు. మా గ్రామాన్ని ఒకే పంచా యతీగా కిందకు తీసుకొస్తే బాగుంటుంది.
- క్రిష్ణప్ప, గ్రామస్థుడు, వెంగంవారిపల్లి