Share News

పాలికొండను పిండేశారు...

ABN , Publish Date - Sep 01 , 2024 | 11:11 PM

వైసీపీ నేతల ధనదాహానికి పాలికొండ బోడుగుండుగా మారింది. చెయ్యేరులో అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాలికొండను తవ్వేసి నదిలోనే ఆ మట్టితో రోడ్డు వేయడంతో పాటు పాలికొండలోని గ్రావెల్‌ను పెద్ద పెద్ద హిటాచీలతో తవ్వేసి టిప్పర్ల ద్వారా తరలించి కోట్లాది రూపాయలకు పడగలెత్తారు కొందరు వైసీపీ నాయకులు.

పాలికొండను పిండేశారు...
హిటాచీతో పాలికొండను తవ్వుతూ ఆ మట్టిని టిప్పర్‌లో వేస్తున్న దృశ్యం

కొండను తొలిచి చెయ్యేరులో రోడ్డేశారు..

కొండ నుంచి అక్రమంగా మట్టి తరలింపు

ఫిర్యాదు చేస్తే దురుసుగా ప్రవర్తించిన డీఎఫ్‌వో

డిప్యూటీ సీఎం పవన్‌కు అతికారి దినేశ్‌ ఫిర్యాదు

తక్షణం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశం

స్పెషల్‌ స్క్వాడ్‌ డీఎ్‌ఫవో శివకుమార్‌ ఆధ్వర్యంలో విచారణ

రాజంపేట, సెప్టెంబరు 1 : వైసీపీ నేతల ధనదాహానికి పాలికొండ బోడుగుండుగా మారింది. చెయ్యేరులో అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాలికొండను తవ్వేసి నదిలోనే ఆ మట్టితో రోడ్డు వేయడంతో పాటు పాలికొండలోని గ్రావెల్‌ను పెద్ద పెద్ద హిటాచీలతో తవ్వేసి టిప్పర్ల ద్వారా తరలించి కోట్లాది రూపాయలకు పడగలెత్తారు కొందరు వైసీపీ నాయకులు. ఈ కొండను తొలిచేసి వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, వారికి డీఎఫ్‌వో వివేక్‌తో పాటు ఇతర అధికారులు సహకరించారని జనసేన నాయకుడు అతికారి దినేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పాలికొండలను అక్రమంగా తవ్విన వైసీపీ నాయకులు, వారికి సహకరించిన అటవీ అధికారులపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డీప్యూటీ సీఎం ఆదేశాలతో ఆదివారం స్పెషల్‌ స్క్వాడ్‌ డీఎఫ్‌వో శివకుమార్‌ నేతృత్వంలో ఫిర్యాదుదారుడు, అతికారి దినేశ్‌తో కలిసి పాలికొండ ప్రాంతంలో విచారణ చేపట్టారు. కొండను తవ్విన అంశాన్ని పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణకు ముప్పు కలిగే రీతిలో కొండపై ఉన్న చెట్లను తొలగించి జేసీబీలు, హిటాచీల ద్వారా కొండను తవ్వి ఆ మట్టిని ఇసుక రీచ్‌ రోడ్డు కోసం చెయ్యేరులో వేసిన అంశాన్ని వారు పరిశీలించారు. రాజంపేట-రాయచోటి ప్రధాన రహదారికి సమీపంలో వీరబల్లె మండల పరిధిలోకి వచ్చే చెయ్యేరు ఆనుకుని పాలికొండ ఉంది. ఈ కొండకు సమీపంలో గత వైసీపీ నాయకులు ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎటువంటి అనుమతులు లేకుండా హిటాచీలు, జేసీబీలు ఏర్పాటు చేసి ప్రత్యేక డంపర్లు, టిప్పర్ల ద్వారా ఆ కొండ మట్టిని ఇసుక రీచ్‌ల రోడ్డుతో పాటు మట్టిని అక్రమంగా అక్కడి నుంచి తరలించారు.

రాయచోటి-రాజంపేట కొండ మార్గంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చనిచెట్ల మధ్య ఈ కొండలు ఉన్నాయి. ఈ కొండలను తవ్వడానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు అనుమతులు ఇస్తే తప్ప ఇక్కడ ఒక చిన్నపాటి చెట్టును కూడా తొలగించడానికి వీలులేదు. సరికదా పెద్దఎత్తున వాహనాలను ఏర్పాటు చేసి కొండను తవ్వడం చట్టరీత్యా పెద్ద నేరం. రాయచోటి-రాజంపేట రోడ్డులో అందరికీ కనుచూపు మేర కనిపించే ఈ కొండలో తవ్వకాలు చేస్తున్నా ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. ఈ విషయమై గత ఏడాది డిసెంబరు 26న అతికారి దినేశ్‌, అన్నమయ్య జిల్లా డీఎఫ్‌వో వివేక్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ కొండ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ప్రకృతి సంపదను కొల్లగొడుతుంటే ఉన్నతాఽధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని డీఎ్‌ఫవోకు తెలిపారు. ఈ కొండ తవ్వకాలపై ఫిర్యాదు చేయడానికి మీరెవరని పేర్కొంటూ తనపై డీఎ్‌ఫవో దురుషుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా అప్పట్లో ఎవరూ దీని గురించి పట్టించుకోలేదు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ రాజంపేటకు వచ్చినప్పుడు జరిగిన సంఘటనపై ఫొటోలతో సహా ఆయనకు చూపించి పాలికొండలో వైసీపీ అక్రమ తవ్వకాలను, మట్టిని ఇసుక రీచ్‌లకు వాడుకోవడాన్ని, ఈ విషయంలో అటవీశాఖ అధికారులు తోడ్పడిన అంశాన్ని, డీఎఫ్‌వో దురుసుగా ప్రవర్తించిన అంశాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపాలని, ఈ మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడింది ఎవరు, ఇందుకు తోడ్పడిన అటవీశాఖ అధికారులు ఎవరు, సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆదివారం స్పెషల్‌ స్క్వాడ్‌ డీఎ్‌ఫవో శివకుమార్‌ నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తవ్విన పాలికొండను పరిశీలించారు. దినేశ్‌ కూడా అధికారులతో పాటు పాలికొండకు వెళ్లి డీఎ్‌ఫవో వివేక్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై తాము ఫిర్యాదు చేస్తే తమ పట్ల డీఎ్‌ఫవో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో తొలగించిన చెట్లను, తవ్విన మట్టిని, తవ్వకాలకు వాడిన హిటాచి, డంపర్లను ఫొటోలతో విచారణ అధికారులకు చూపించారు. తవ్విన కొండ ఏ పరిధిలోకి వస్తుందో రిజర్వు ఫారె్‌స్టకు వస్తుందా లేదా అన్న అంశంపై మ్యాప్‌ల ద్వారా పరిశీలించారు. వెంటనే దీనిపై పూర్తి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామని స్పెషల్‌ స్క్వాడ్‌ డీఎ్‌ఫవో శివకుమార్‌ వెల్లడించారు.

Updated Date - Sep 01 , 2024 | 11:11 PM