దుర్భర స్థితిలోనూ సంక్షేమ బాట: ఎమ్మెల్యే మాధవి
ABN , Publish Date - Sep 23 , 2024 | 12:18 AM
వైసీపీ ఐదేళ్లపాలనలో రాష్ట్రపరిస్థితి దుర్భరంగా మారినా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ బాట పట్టిందని కడప ఎమ్మెల్యే మాధవి తెలిపారు.
కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 22 : వైసీపీ ఐదేళ్లపాలనలో రాష్ట్రపరిస్థితి దుర్భరంగా మారినా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ బాట పట్టిందని కడప ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం 21వ డివిజన బాలవికాస్ పాఠశాల సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక ప్రజలకు భరోసా కల్పించారు. వైసీపీ పాలనలో అన్నిరంగాలను భ్రష్టుపట్టించారన్నారు. ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, రైతుబజార్లు, సచివాలయాలు ఇలా అన్నింటినీ తనఖా పెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. చంద్రబాబు మళ్లీ అన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో సంక్షేమపాలన అందజేస్తున్నారన్నారు. అడిషనల్ కమిషనరు రాకేశచంద్రం, నాయకులు పాల్గొన్నారు.