గ్రామాల్లో పారిశుధ్యంపై శ్రద్ధ పెట్టండి
ABN , Publish Date - Oct 10 , 2024 | 11:56 PM
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి
కమలాపురం రూరల్, అక్టోబరు 10 : గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి తెలిపారు. గురువారం గ్రామోదయం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేతో కలిసి మండల ప్రత్యేక అధికారి వెంకటసుబ్బారెడ్డి దేవరాజుపల్లె గ్రామం ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన విధానంపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణప్రాంతాల అబివృద్ధికి కృషి చేస్తోందన్నారు. అందుకు అవసరమైన నిధులు కూడా ఇస్తుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, తాగునీరు, సీసీరోడ్లు, వీధిలైట్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు.కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా సాగుతోందన్నారు. సంపద సృష్టి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈఓపీఆర్‌డీ కెజియా, హౌసింగ్ ఏఈ ప్రతా్‌పరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ రాజేశ, ఐసీడీఎస్ సూపర్‌వైజరు సుబ్బమ్మ, పంచాయతీ సెక్రటరీ గంగాధర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.