Share News

సంక్రాంతికైనా పాత బకాయిలు చెల్లించండి : ఎస్టీయూ

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:33 PM

సంక్రాంతి పండుగకైనా పాత బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్‌ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సంక్రాంతికైనా పాత బకాయిలు చెల్లించండి : ఎస్టీయూ
సమావేశంలో మాట్లాడుతున్న ఇలియాస్‌ బాషా

కడప ఎడ్యుకేషన, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకైనా పాత బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్‌ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం కడపలోని ఎస్టీయూ భవనలో జరిగిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఈఎల్స్‌, ఏపీజీఎల్‌ఐ, ఫైనల్‌ పేమెంట్స్‌, పీఎఫ్‌ ఫైనల్‌ పేమెంట్స్‌, పీఎఫ్‌ లోన్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉ న్నాయని, వీటి చెల్లింపుల కోసం ఉపాధ్యాయలోకం ఎదురుచూస్తోందన్నారు. సంక్రాంతి పం డుగకైనా చె ల్లించాలని కోరారు. అలాగే రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు కె. సురే్‌షబాబు మాట్లాడుతూ చాలా పాఠశాలలో ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయని, త్వరగా పదోన్నతులు చేపట్టి వాటిని భర్తీ చేయాలని కోరారు. జేఎల్‌ ప్రమోషన్లు కూడా చేపట్టాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంభం బాలగంగిరెడ్డి మాట్లాడుతూ నాన టీచింగ్‌ వారి పట్ల ఉన్న మక్కువ ఉపాధ్యాయుల పట్ల లేకపోవడం బాధాకరమన్నారు. 40శాతం జేఎల్‌ పదోన్నతులు వెం టనే చేపట్టాలని కోరారు. 12వ పీఆర్సీ ఆలస్యం అవుతున్న కారణంగా 30 శాతం ఫిట్‌మెంట్‌ వెంటనే ఇవ్వాలని కోరారు. ఎస్టీయూ నాయకులు గాలి సుబ్బరాయుడు, ప్రతా్‌పరెడ్డి, నందగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:33 PM