ప్రశాంతంగా సాగునీటి ఎన్నికలు
ABN , Publish Date - Dec 14 , 2024 | 11:58 PM
మదనపల్లె మండలంలోని నాలుగు సాగు నీటి చెరువులకు సంబంధించి శనివారం నిర్వ హించిన నీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
మదనపల్లె/ టౌన/ అర్బన, డిసెంబరు 14(ఆంధ్ర జ్యోతి): మదనపల్లె మండలంలోని నాలుగు సాగు నీటి చెరువులకు సంబంధించి శనివారం నిర్వ హించిన నీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండలంలోని సీటీఎం పెద్దచెరువు, చిన్నారాయనచెరువు, లింగిశెట్టిచెరువు, వెంకటమ్మ చెరువుల సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిం చారు. ప్రతి సంఘానికి ఆరుగురు టీసీ సభ్యుల స్థానాలకు కేవలం ఒక్కొక్క నామినేషన మాత్రమే దాఖలు కావడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైన ట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు నాలుగు చెరువుల సంఘాలకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను టీసీ సభ్యు లు ఎన్నుకున్నారు. లింగిశెట్టిచెరువుకు అధ్యక్షు డుగా పి.రాజన్న, ఉపాధ్యక్షుడుగా కృష్ణమూర్తి, వెంకటమ్మచెరువుకు అధ్యక్షుడుగా కె.శివయాదవ్, ఉపాధ్యక్షుడుగా చిన్నరెడ్డెప్ప ఎన్నికయ్యారు. సీటీ ఎం పెద్దచెరువుకు ప్రసాదనాయుడు, ఉపాధ్యక్షు డుగా సద్దాంహుస్సేన, చిన్నాయనచెరువు అధ్యక్షు డుగా వేమన్న, ఉపాధ్యక్షుడుగా రాజేంద్ర ఎన్నిక య్యారు. ఈ ఎన్నికలను తహసీల్దార్ ఖాజాభీ, ఎంపీడీవో తాజ్‌మస్రూర్, ఏవో నాగప్రసాద్, సీఎస్ డీటీ రెడ్డెప్పలు అబ్జర్వర్లుగా వ్యహరించారు.
రెండు ప్రాజెక్టులు, 52చెరువులు ఏకగ్రీవం
మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో తంబ ళ్లపల్లె పెద్దేరు ప్రాజెక్టు, నిమ్మనపల్లె బాహుదా ప్రాజెక్టులతోపాటు 53 చెరువులకు శనివారం సాగునీటి సంఘాల ఎన్నికల్లో పెద్దమండ్యం మం డలంలోని పాపిరెడ్డిచెరువు ఎన్నిక వాయిదా పడ గా, మిగిలిన రెండుప్రాజెక్టులు, 52 చెరువులకు ఎన్నికలు ప్రశాంతంగా, ఏకగ్రీవంగా సాగాయి. ఇం దులో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని తంబళ్లప ల్లె, కురబలకోట, బి.కొత్తకోట, ములకలచెరువు, పీటీఎం, పెద్దమండ్యం మండలాల్లో 38 చెరువులు, పెద్దేరు ప్రాజెక్టు ఉన్నాయి. అలాగే మదనపల్లె నియోజకవర్గంలోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లో 15 చెరువులు, నిమ్మ నపల్లె బాహుదా ప్రాజెక్టు ఉన్నాయి. ఇందులో అన్ని చెరువులకు ఎన్నికలు ప్రశాంతంగా ఏకగ్రీ వంగా జరిగాయి. అలాగే నిమ్మనపల్లె బహుదా ప్రాజెక్టులోని ఆరు టీసీల్లో ఒకటో టీసీకి ఎన్నిక జరగ్గా, మిగిలిన అయిదు టీసీలు ఏకగ్రీవమయ్యా యి. ఇందులో రెండుప్రాజెక్టులు సహా చెరువులన్నీ కూటమి ప్రభుత్వమే గెలుచుకుంది. మదనపల్లె మండలంలోని చీకలబైలు వెంకటమ్మ చెరువు సాగునీటి సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ మండ్యెం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎన్నికను నిర్వహించారు. వెంకటమ్మ చెరువు సాగునీటి సంఘం కమిటీ అధ్యక్షుడిగా కె. శివయాదవ్, ఉపాధ్యక్షుడిగా బి.చిన్నరెడ్డెప్ప ఏకగ్రీ వంగా ఎన్నికయ్యా రు. ఈ సందర్భంగా ఎన్నికైన సాగునీటి సంఘం సభ్యులను సర్పంచ మండ్యెం ప్రభాకర్ తోపాటు టీడీపీ నాయకులు, అధికారులు అభినందించారు. మాజీ ఎంపీటీసీ మేడి పల్లె రాజన్న, కొల్లవారిపల్లె రాజన్న, సుబ్బిరెడ్డి, రమణ యాదవ్, బండి రాజ్‌కుమార్, మాజీ ఉప్పసర్పంచ జిల్లెళ్ల లక్ష్మున్న, రవీంద్ర, జోలాపేట నాయుడు, మేడిపల్లె వై.నరసింహులు, దినేష్‌రెడ్డి, లక్ష్మీదేవి, కృష్ణప్ప, కొక్కల హారి, హరి, ధ్వారకనాథ్, రెవెన్యూ, ఇరిగేషన అధికారులు పాల్గొన్నారు.
ములకలచెరువులో: తంబళ్లపల్లె నియోజకవర్గం లో శనివారం జరిగిన సాగునీటి సంఘాల ఎన్ని కల్లో టీడీపీ విజయం సాధించడం హర్షణీయమని నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లి జయ చంద్రారెడ్డి పేర్కొన్నారు. ములకలచెరువులో ని పార్టీ కార్యాలయంలో శనివారం సాగునీటి సం ఘాల ఎన్నికల్లో విజయం సాధించిన ఆరు మం డలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీసీ మొంబర్లు జయచంద్రారెడ్డిని కలిసి సంబరాలు చేసుకున్నారు. ములకలచెరువు పెద్దచెరువు అధ్యక్షుడిగా చెన్నకే శవులు, ఉపాధ్యక్షుడిగా లక్ష్మీరెడ్డి, దేవళచెరువు తిరుమలదేవరచెరువు అధ్యక్షుడిగా నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడిగా రామచంద్ర, గుడుపల్లె పెద్దచెరువు అధ్యక్షుడిగా గాలి రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా వెంకటనారాయణ, బురకాయలకోట గుమ్మసము ద్రం చెరువు అధ్యక్షుడిగా భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షు డిగా హరినాధరెడ్డి, మద్దినాయనిపల్లె బాట్నాయని చెరువు అధ్యక్షుడిగా వెంకటరమణ, ఆంజనేయు లు, అలంకనాయనిచెరువు అధ్యక్షురాలిగా రమణ మ్మ, ఉపాధ్యక్షుడిగా మోహనరెడ్డి, తిమ్మసముద్రం చెరువు అధ్యక్షుడిగా రెడ్డెప్ప, ఉపాధ్యక్షుడిగా పెద్ద మల్లికార్జున, సోంపల్లె పెద్దచెరువు అధ్యక్షుడిగా చలపతి, ఉపాధ్యక్షుడిగా రామకృష్ణలు ఎన్నికయ్యా రు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార సమ న్వయకర్త సీడు మల్లికార్జుననాయుడు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన కేవీ రమణ, మాజీ వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, నాయకులు ఓబులేసు, బూర్లపల్లె శ్రీనివాసులు, సికిందర్ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసు కోకుండా సీఐ లక్ష్మన్న, ఎస్‌ఐ నరసిం హులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.
పీలేరులో ఏకగ్రీవంగా ముగిసిన ఎన్నికలు
పీలేరు, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): పీలేరు మం డలంలో శనివారం జరిగిన సాగునీటి వినియోగ దారుల సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా, ఏకగ్రీ వంగా ముగిశాయి. వైసీపీ నాయకులు ఈ ఎన్ని కలను బహిష్కరించడంతో మండలంలో ఎన్నికలు జరిగిన మూడు సంఘాలను టీడీపీ కైవసం చేసుకుంది. అంతే కాకుండా చిత్తూరు జిల్లా సదుం మండల పరిధిలోకి వచ్చిన అగ్రహారం చెరువు సంఘాన్ని కూడా పీలేరు వాసి చేజిక్కిం చుకున్నారు. పీలేరు మండలం పీలేరు పట్టణం లోని అయ్యప్పనాయుని చెరువు అధ్యక్షునిగా పసల హరినాథ్, ఉపాధ్యక్షుడిగా అయ్యల నా రాయణ, గూడరేవుపల్లె పంచాయతీలోని సూరప్ప చెరువు అధ్యక్షునిగా మాజీ సర్పంచ మూరే అన్నా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా విశ్వనాథ్, చింతల చెరువు అధ్యక్షునిగా రాయల రమణ, ఉపాధ్యక్షునిగా మో కాటి ఎర్రయ్య గెలుపొందారు. సదుం మండల పరిధిలోకి వచ్చిన అగ్రహారం పెద్దచెరువు అధ్యక్షు నిగా రామిరెడ్డిగారిపల్లెకు చెందిన బయ్యారెడ్డి వెం కటరమణా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీలే రు తహసీల్దారు భీమేశ్వర రావు, ఎంపీడీవో శివ శంకర్, ఈవోపీఆర్‌ఆర్‌డీ లతీఫ్ ఖాన, పీఆర్ ఏఈ రామకృష్ణ నాయక్ ఎన్నికల అధికారులుగా వ్యవ హరించారు. ఎటువంటి అవాంఛనీయం సంఘట నలు జరగకుండా పీలేరు అర్బన సీఐ యుగంధర్, ఎస్‌ఐలు బాలకృష్ణ, లోకేశలు తమ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. సాగునీటి సంఘా ల సభ్యులుగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఫోనులో అభినందించారు.
కలికిరిలో రెండు కమిటీలు ఏకగ్రీవం
కలికిరి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కలికిరి మం డలంలో రెండు సాగునీటి సంఘాల కమిటీలకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధికార టీడీపీ చెందిన వారే రెండు సంఘాలకు ఎన్నికయ్యారు. కలికిరి పెద్దచెరువు కమిటీకి జి.రత్నశేఖర్ రెడ్డి అధ్యక్షుడుగా, ఎం.సుందరరాజుల శెట్టి ఉపాధ్యక్షు డుగా ఎన్నికయ్యారు. గుండ్లూరు బయ్యపురెడ్డి చెరు వు కమిటీ అధ్యక్షురాలుగా ఎం.శ్యామలమ్మ, ఉపాధ్యక్షుడుగా కె. నాగయ్య ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. తహసీల్దారు మహేశ్వరీబాయి, ఎంపీడీ వో భానుమూర్తిరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.
గుర్రంకొండలో:గుర్రంకొండ మండలంలో సాగు నీటి సంఘం ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా ముగిసాయి. ఇందులో నడిమి ఖండ్రిగ పెద్దచె రువు అధ్యక్షుడిగా డి.శేఖర్, ఉపాఽధ్యక్షు డిగా రావ చంద్ర, హిమామ్‌బేగ్ చెరువు అధ్యక్షుడిగా సి.శ్రీని వాసులు, ఉపాధ్యక్షుడిగా పవనకుమార్, రామానా యునిచెరువు అధ్యక్షుడిగా కె.కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షు డిగా శ్రీరాములు, రాశిచెరువు అధ్యక్షుడిగా ఎం.సీ తారామయ్య, ఉపా ధ్యక్షుడిగా మధనమోహనరెడ్డి, హరిహరాదులచెరువు అధ్యక్షుడిగా ఓబుల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఖాదర్‌వలిలను ఏకగ్రీవంగా ఎన్ను కొన్నట్లు ఎంపీ డీవో వెంకటేశులు, తహశీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండల వ్యాప్తం గా శనివారం నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికలు మొత్తం అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీ వమయ్యారు. మండలంలోని చింతపర్తి ఎగువరం గారెడ్డి చెరువు సంఘ ఎన్నికల్లో చైర్మనగా సుబ్బా రెడ్డి, వైస్‌చైర్మనగా సుబ్రహ్మణ్యం, గండబోయన పల్లె సంఘ చైర్మనగా అమృతనాథరెడ్డి, వైస్ చైర్మ నగా సుధాకర్‌రెడ్డి, విఠలం రామస్వామి చెరువుకు సంబంధించి చైర్మనగా ఎ.శివారెడ్డి, వైస్ చైర్మనగా ప్రసాద్, తాటిగుంటపల్లె కొత్తచెరువు సంఘ చైర్మనగా పి.రామకృష్ణరెడ్డి, వైస్ చైర్మనగా ఎ.పెద్ద రెడ్డెప్ప, టిసాకిరేవుపల్లె రాజుచెరువు సంఘ చైర్మన గా కె.లక్ష్మీదేవి, వైస్ చైర్మనగా ఈశ్వరమ్మ, కూరప ర్తి గ్రామం చెరువు సాగు నీటి సంఘం చైర్మనగా శ్రీనివాసులురెడ్డి, వైస్ కృష్ణయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ ప్రసాద్ బాబు, ఎస్‌ఐ చంద్రశేఖర్‌లు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. తహసీల్దార్ పామి లేటి, ఎంపీడీవో మనోహర్‌రాజు తదితరులు ఎన్ని కల అధికారులుగా పర్యవేక్షించారు.
కలకడలో:మండలంలోని రెండు నీటి సంఘాలకు శనివారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి నట్లు తహశీల్దార్ ఫణికుమార్‌తెలిపారు. నవాబ్‌పే ట పెద్దచెరువుకు అధ్యక్షుడిగా నరసింహారెడ్డి, ఉపా ధ్యక్షుడిగా శ్రీనివాసులు, అలాగే గుడిబండ చెరువు అధ్యక్షుడిగా రామాంజులు, ఉపాధ్యక్షుడిగా వెంకటే శ్వరరావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులుగా తహశీల్దార్ ఫణికుమార్, ఎంపీడీవో అబ్దుల్ రహీంలు ఉన్నారు. ఎన్నికైన చైర్మెనలను ఆయకట్టుదారులు అభినందించి సన్మానించారు.
కురబలకోటలో: మండలంలో సాగునీటి సంఘా ల ఎన్నికలను ప్రశాతంతంగా నిర్వహించారు. మల్లేశ్వరమ్మ, చెరువు చైర్మనగా పి.రమణారెడ్డి, వైస్ చైర్మనగా తూట్ల కృష్ణప్పలను పెద్ద చెరువు చైర్మనగా బీదం మల్లయ్య, వైస్ చైర్మనగా మధునాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి తహశీల్థార్ తపశ్విని నియామక దృవపత్రాలను అందజేశారు. ఎంపికైన కార్యర్గానికి టీడీపీ తంబళ్ళపల్లె నియోజకవర్గ పరిశీలకుడు మల్లికార్జున నాయుడు, పి.సూరి, తూట్ల రవీంద్ర యాదవ్ తదితరులు అభినందించారు.
రామసముద్రంలో: మండలంలో శనివారం జరిగిన ఎనిమిది చెరువుల సాగునీటి సంఘ ఎన్నికల్లో చైర్మనలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో అతిపెద్ద చెరువైన అగ్రహారం చెరువు సాగునీటి సంఘ చైర్మనగా పాలాబత్తుల వెంకటాచలపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప్పునెల్లి చెరువు చైర్మనగా సుధాకర్‌రెడ్డి, వడ్డివాని చెరువుకు పాల చెంగారెడ్డి, పాయచెరువుకు అమ రప్ప, కనగాని చెరువుకు ఆర్‌కృష్ణారెడ్డిలను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సాగునీటి సంఘ చైర్మనలకు టీడీపీ మండల అధ్యక్షుడు విజయ్‌కు మార్‌గౌడు శుభాకాంక్షలు తెలియజేశారు.
బి.కొత్తకోటలో: బి.కొత్తకోట మండలంలోని సాగు నీటి వినియోగదారుల సంఘాలకు శనివారం నిర్వ హించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని ఐదు చెరువుల సాగునీటిసంఘాల ఎన్నికకు ప్రత్యేక అధికారులను నియమించి తహశీల్దార్ మహమ్మద్‌అన్సారీ ప్రక్రియను పర్య వేక్షించారు. పట్టణంలోని డేగానిచెరువుతోపాటు మూడు చిన్నచెరువుల సంఘ చైర్మనగా ఆవుల రామచంద్ర, గట్టు పాపినాయునిచెరువు ఛైర్మన గా శెట్టినాగలాంబిక, గుమ్మసముద్రం పెద్దచెరువు చైర్మనగా జల్లారామప్ప, బయప్పగారిపల్లి ఓబుల నాయునిచెరువు చైర్మనగా వి.మనోహర్‌రెడ్డి, బడికా యలపల్లె పెద్దచెరువు చైర్మనగా రామచంద్రారెడ్డి లతో పాటు వైస్‌చైర్మనలు ఏకగ్రీవంగా ఎన్ని క య్యారు. సీఐ జీవన గంగాధర్‌బాబు బందోబస్తు సమీక్షించారు. నూతన చైర్మన, వైస్ చైర్మన, సభ్యు లను కూటమి నాయకులు అభినందించారు.
పెద్దతిప్పసముద్రంలో:పెద్దతిప్పసముద్రం మం డలంలో 7 చెరువులకు శనివారం సాగునీటి సం ఘాలకు ఎన్నికలను నిర్వహించగా అన్ని ఏక గ్రీవంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. మం డల కేంద్రమైన పీటీఎం పెద్దచెరువు చైర్మనగా కోట్లోని వెంకట్రమణారెడ్డి, వైస్ చైర్మనగా కార్యం శంకర, రంగసముద్రం పెద్ద చెరువు చైర్మనగా వరకల చెన్నకేశవ, వైస్ చైర్మనగా కుమ్మర క్రిష్ణప్ప, మడుమూరు జంబుగానిచెరువు చైర్మనగా గాజుల వరలక్ష్మీ, వైస్ చైర్మనగా రామక్రిష్ణ, పులి కల్లు వీరపనాయునిచెరువు చైర్మనగా లక్షుమన్న, వైస్ చైర్మనగా బాస్కర్ నాయుడు, టి.సదుం పెద్దచెరువు చైర్మనగా గంగంపల్లె రామకృష్ణారెడ్డి, వైస్ చైర్మనగా చింతమాని నరేష్, టి.సదుం గ్రామం తుమ్మలచెరువు చైర్మనగా పెద్దిరెడ్డిగారి వెంకటరెడ్డి, వైస్ చైర్మనగా వాసుదేవరెడ్డిగారి హరీష్, కందుకూరు వ్యాసరాయసముద్రం చెరువు చైర్మనగా మండ్లిపల్లె రమేష్‌బాబు, వైస్ చైర్మనగా అరికల వెంకటప్పలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లను తం బళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం నేత దాసరి పల్లె జయచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దమండ్యంలో: మండలంలో జరిగిన సాగునీ టి సంఘాలకు శనివారం చైర్మన, వైస్ చైర్మన పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. పాపిరెడ్డిచె రువు ఎన్నికలో కోరం లేక వాయిదా వేసినట్లు ఎంఈవో 2 రామకృష్ణ వెల్లడించారు. వెలిగల్లు పెద్దచెరువు చైర్మనగా గిరిబాబు, వైస్ చైర్మనగా సి. ఆశలను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తహసీల్దార్ సయ్యద్ ఆహ్మద్ వెల్లడించారు. లంపవంకచెరువు చైర్మనగా చలపతినాయుడు, వైస్ చైర్మనగా శంకర్ నాయక్, తిప్పిరెడ్డిచెరువు చైర్మనగా రామకృష్ణారెడ్డి, వైస్ చైర్యనగా సయ్యద్ ఖాజాపీర్, లోతువంక చెరువు చైర్మనగా నరసింహులు, వైస్ చైర్మన గా మల్లికార్జున, సిద్దవరం చెరువు చైర్మనగా కిరణ్‌కు మార్, వైస్ చైర్మనగా రవీంద్ర ప్రసాద్‌లు ఎన్నికై నట్లు తెలిపారు. ఎన్నికైన సాగునీటి సంఘాల చైర్మనలు, వైస్ చైర్మనలు కూటమి మద్దతుదా రులేనని టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు విశ్వ నాధరెడ్డి, సుమనకుమార్, గాంగధర, క్రిష్ణారెడ్డి, మహేశ్వర, కుంటకిందపల్లి చంద్రారెడ్డి నాగేశ్వ రరెడ్డి, ప్రభాకరరెడ్డి, కాలేషా వెల్లడించారు.
తంబళ్లపల్లెలో: మండలంలో శనివారం జరిగిన సాగునీటిసంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి నట్లు ఎన్నికల నిర్వహణాధికారులు సురేష్‌కుమా ర్‌రెడ్డి, తహశీల్దార్ హరికుమార్‌లు తెలిపారు. మండలంలోని పెద్దేరు ప్రాజెక్టు చైర్మనగా శివ కుమార్, వైస్ చైర్మనగా శివయ్య, కన్నెమడుగు పెద్దచెరువు చైర్మనగా మధుసూధనరెడ్డి, వైస్ చైర్మనగా సుధాకర్‌రెడ్డి, బయమ్మచెరువు చైర్మనగా ఆదిరెడ్డి, వైస్‌చైర్మనగా సురేందర్‌రెడ్డి, చెండ్రాయుని చెరువు చైర్మనగా వెంకట్రమణారెడ్డి, వైస్‌చైర్మనగా పెద్దప్పల్ల, కోటకొండ పెద్దచెరువు చైర్మనగా చిన్నరె డ్డెప్ప, వైస్‌చైర్మనగా కిష్నారెడ్డి, గోపిదిన్నె చెరువు చైర్మనగా నరసింహారెడ్డి, వైస్‌చైర్మనగా సుధాకర్ రెడ్డి, బాలిరెడ్డిచెరువు చైర్మనగా జైహిం ద్‌రెడ్డి, వైస్‌చైర్మనగా రఘునాథ్‌రెడ్డి, అక్కమ్మ చెరువు చైర్మనగా శివకుమార్ వైస్‌చైర్మనగా వైస్‌ఛైర్మనగా సుధాకర్‌రెడ్డి, రాతిచెరువు చైర్మనగా రామలింగారె డ్డి, వైస్‌చైర్మన నరేంద్రకుమార్, పంచాలమర్రి పెద్దచెరువు చైర్‌పర్సనగా రామసుబ్బమ్మ, వైస్ చైర్మనగా శివప్రసాద్, అన్నగారిపల్లె ఆనకట్ట చైర్మ నగా సోమశేఖర్‌నాయుడు, వైస్‌చైర్మ నగా జయ రాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు.