పెన్షనర్ల బకాయిలను వెంటనే మంజూరు చేయాలి
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:47 PM
రాష్ట్రంలోని పెన్ష నర్లకు పెండింగ్‌లో ఉన్న డీఏలతోపాటు ఇతర అరి యర్స్‌ను వెంటనే మంజూ రు చేయాలని ఆంధ్రప్రదేశ పెన్షనర్ల సంఘం పీలేరు శాఖ అధ్యక్షుడు చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
పీలేరు, డిసెంబరు 25(ఆం ధ్రజ్యోతి): రాష్ట్రంలోని పెన్ష నర్లకు పెండింగ్‌లో ఉన్న డీఏలతోపాటు ఇతర అరి యర్స్‌ను వెంటనే మంజూ రు చేయాలని ఆంధ్రప్రదేశ పెన్షనర్ల సంఘం పీలేరు శాఖ అధ్యక్షుడు చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా మండలంలోని పెన్షనర్లతో స్థానిక మెయిన స్కూలులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సంబంధిత అంశాలను మంజూరు చేస్తే పెన్షనర్లకు ఉప యోగకరంగా ఉంటుందన్నారు. అదే విధంగా పీఆర్‌సీ కూడా వెంటనే ప్రకటించాల న్నారు. పెన్షనర్లందరూ తమ ఆదాయ పన్ను రిటర్స్న్‌ను దాఖలు చేయాలని ఆయన సూచించారు. పెన్షనల కొనసాగింపునకు అనుకూలంగా జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్ర వరి 28వ తేదీ మధ్యలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని గుర్తు చేశారు. అనంతరం 80 వసంతాలు పూర్తి చేసుకున్న తమ సహచరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు వి.రామచంద్ర, ఎర్రమరాజు, జి.రాధాకృష్ణ, నరసింహారెడ్డి, కృష్ణయ్య, సీతారామయ్య, ఆంజనేయులు, రాజశేఖర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.