ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 16 , 2024 | 12:01 AM
రాష్ట్ర విపత్తుశాఖ కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన దృష్ట్యా మదనపల్లె డివిజనలోని ప్రజ లు 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు.
మదనపల్లె టౌన, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విపత్తుశాఖ కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన దృష్ట్యా మదనపల్లె డివిజనలోని ప్రజ లు 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండా లన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితులు తెలెత్తితే సబ్‌కలెక్టరేట్‌లో మూడు షిప్టులతో పనిచేస్తున్న కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఉద యం 6గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు 9989176247 నెంబర్ కు, మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 10గంటల వరకు 9490827676, నెంబర్‌కు, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు 6303308475 నెంబర్‌లకు ఫోన చేసి అత్యవసర సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమా చారం అందిన వెంటనే సంబంధిత అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలిస్తారన్నారు. అదే విఽధంగా రాష్ట్ర, జాతీయ రహదారుల మీద ఉండే కల్వర్టుల వద్ద వాహనదారులు జాగ్రత్త లు పాటించాలన్నారు. గర్బిణులు, బాలింతలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి అత్యవరసర సమయంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు కలుషితం కాకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు పడే సమ యంలో పిడుగులు పడే అవకాశం ఉందని, అలాంటి సమయాల్లో సుర క్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించారు. మంగళవారం సాయంత్రం వర కు డివిజనలోని 11 మండలాల్లో 222.2 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైం దన్నారు. అందులో అత్యధికంగా కురబలకోటలో 27 ఎంఎం, అత్యల్పంగా రామసముద్రంలో 12.2 ఎంఎం వర్షపాతం నమోదైందన్నారు.
తుపాన పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి
పెద్దతిప్పసముద్రం అక్టోబర్ 15 (ఆంద్రజ్యోతి) : తుపాన పట్ల పాడి రైతు లు అప్రమత్తంగా ఉండాలని మండల పశువైధ్యాధికారి రమేష్‌నాయక్ సూచించారు. మంగళవారం ఆయన స్థానిక మండల కేంద్రమైన పీటీఎం లో పాడి రైతులకు అవగాహన కల్పించారు. తుపాన సమయంలో పాడి రైతులు పశువులను లోతట్టు ప్రాంతాలలో, వృక్షాలు, టవర్లు కింద మేప కూడదన్నారు. పశువులను ఎలక్ర్టికల్ స్తంభాలకు, వేలాడే తీగలకు, ట్రాన్స పార్మర్ల దగ్గర కట్టి వేయరాదన్నారు. పాడి ఆవులను వర్షాలకు తడవకుం డా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నిమ్మనపల్లిలో: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపఽథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని తహసీల్దార్ ధనంజేయులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసు కోవాలన్నా రు. అలాగే గ్రామాలలోని కుంటలు, చెరువులు, వద్ద సంభందిత అధికా రులు పర్యవేక్షించాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాడిరైతులు ఆవులు, గొర్రెలను సురక్షిత ప్రాంతాలను తరలించాలని వశు వైద్యాధికారి సురేష్ తెలిపారు.
రామసముద్రంలో: తుఫాను ప్రభావంతో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో భానుప్రసాద్ సూచిం చారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సెక్రటరీలతో సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆయా పంచాయతీలలోని చెరువు కట్టల పటి ష్టతను పరిశీలించాలని, తాగునీరు క్లోరినేషన, ట్యాంక్‌క్లీనింగ్, శానిటేషన మెటీరియల్ జేసీబీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే గాలి ప్రభావంతో చెట్లు విరిగి రోడ్డుపై పడడం, విద్యుత తీగలు తెగిప డడం వంటి సంఘటనలు జరిగితే వెంటనే యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం చెంబకూరు సమీపంలో ఉన్న చెల్లాయ చెరువును పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లతో కలసి ఎంపీడీవో పరిశీలించారు.
కలికిరిలో: తుఫాన కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల పంచాయతీల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో భానుమూర్తి రావు ఆదేశించారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగు నీరు కలుషితమయ్యే అవకాశాలున్నాయని, బోర్ల సమీపంలో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు వ్యాప్తి జరగకుండా అవసరమైతే వైద్య సిబ్బంది సహాయంతో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.