సామాజిక విప్లవ యోధుడు పూలే
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:09 AM
నాటి సమాజంలో పేరుకుపోయిన అంటరానితనం, కులరక్కసి కోరలను కూకటి వేళ్లతో పెకలించిన తొలి సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఎస్ అమీర్‌బాబు, టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు మాసా కోదండరామ్ కొనియాడారు.
కడప మారుతీనగర్, నవంబరు 28, (ఆంధ్రజ్యోతి): నాటి సమాజంలో పేరుకుపోయిన అంటరానితనం, కులరక్కసి కోరలను కూకటి వేళ్లతో పెకలించిన తొలి సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఎస్ అమీర్‌బాబు, టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు మాసా కోదండరామ్ కొనియాడారు. గురువారం పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక కో-ఆపరేటివ్ కాలనీలోని అమీర్‌బాబు కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నా రా చంద్రబాబు నాయుడు పూలే అడుగు జా డల్లో నడుస్తూ బీసీల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బీసీల సంక్షేమానికి రూ.39 వేల కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆమూరి బాలదాసు, నాయకులు నాసర్ అలీ, కరీముల్లా, శ్రీనివాసులు పాల్గొన్నారు.