Share News

పుష్పగిరి రోడ్డు వెంబడి మొక్కల పెంపకం

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:06 AM

పర్యావరణ పరిరక్షణ, నీడ, పచ్చదనం కోసం పుష్పగిరి రోడ్డు వెంబడి మొక్కల పెంపకం చేపట్టారు.

పుష్పగిరి రోడ్డు వెంబడి మొక్కల పెంపకం
మొక్కలు నాటుతున్న వనసంరక్షణ సమితి సభ్యులు

చెన్నూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ, నీడ, పచ్చదనం కోసం పుష్పగిరి రోడ్డు వెంబడి మొక్కల పెంపకం చేపట్టారు. వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో డీఎ్‌ఫఓ నాగేశ్వర్‌రావు ఆదేశాల మేరకు శనివారం ఎఫ్‌ఆర్వో మద్దిలేటి పుష్పగిరి రోడ్డు వెంబడి సుమారు 2వేల మొక్కలు నాటించారు. రావి, షెల్టోఫారం, నేరేడు, వేప, కానుగ, నిద్రగన్నేరు లాంటి మొక్కలను రోడ్డుకిరువైపులా నాటిస్తున్నారు. గత ఏడాది రూ.9 కోట్లతో హైవే రహదారి ఉప్పరపల్లె క్రాస్‌ రోడ్డు నుంచి పుష్పగిరి వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించారు. వీఎ్‌సఎస్‌ అధ్యక్షుడు గంగయ్య ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

Updated Date - Nov 24 , 2024 | 12:06 AM