Share News

ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించండి సార్‌!

ABN , Publish Date - Dec 17 , 2024 | 12:06 AM

పిడుగుపడి తన భార్య మృతి చెందిందని, పేద లైన తమకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించండి సార్‌! అంటూ మదనపల్లె మండలం పాళెంకొండకు చెందిన బాధితు డు కృష్ణమూర్తి సబ్‌కలెక్టర్‌ మేఘ స్వరూప్‌కు విన్నవించాడు.

ప్రభుత్వం నుంచి  పరిహారం ఇప్పించండి సార్‌!
పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌

మదనపల్లె టౌన, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పిడుగుపడి తన భార్య మృతి చెందిందని, పేద లైన తమకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించండి సార్‌! అంటూ మదనపల్లె మండలం పాళెంకొండకు చెందిన బాధితు డు కృష్ణమూర్తి సబ్‌కలెక్టర్‌ మేఘ స్వరూప్‌కు విన్నవించాడు. సోమ వారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో సబ్‌కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా బాధితుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏడాది క్రితం పిడుగుపడి తన భార్య పద్మావతమ్మ మృతి చెందిన విషయమై పలుమార్లు అధికారులకు వినతి పత్రం ద్వారా విన్నవించినా ఇంత వరకు స్పందన లేదని వాపోయాడు. దీనిపై తనకు న్యాయం చేయాలని కోరాడు. వ్యవసాయ విద్యుత కనెక్షన కోసం ఎస్పీడీసీఎల్‌కు తొమ్మిదినెలల క్రితం రూ.6లక్షలు చలానా చెల్లించినా విద్యుతశాఖ అధికారులు తన బోరుకు ఇంత వరకు విద్యుత కనెక్షన ఇవ్వలేదని కొండామరిపల్లెకు చెందిన రైతు భాస్కర్‌రెడ్డి సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తమ గ్రామంలోని సొంత ఇంటిలోకి వెళ్లనీయకుండా దాయాదులు తమను కొట్టి తరిమేస్తున్నారని కురబలకోట మండలం ముట్రవారిపల్లెకు చెందిన వృద్ద దంపతులు రమణమ్మ,, జయరామ్‌ సబ్‌కలెక్టర్‌ను ఆశ్రయించారు. వీటితో పాటు పాసుపుస్తకాలు మంజూరు చేయడం లేదని పలువురు సబ్‌కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేశారు. ఈ అర్జీలన్నింటిని క్షేత్రస్థాయిలో విచారిం చి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సబ్‌కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Updated Date - Dec 17 , 2024 | 12:06 AM