‘త్వరలో టీడీపీకి పూర్వ వైభవం’
ABN , Publish Date - Mar 05 , 2024 | 10:58 PM
తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని, ఈసారి బద్వేలులో టీడీపీ జెండా ఎగురవేస్తామని యువనాయకుడు రితీష్‌రెడ్డి వ్యాఖ్యానిం చారు.
ట్లూరు, మార్చి 5: తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని, ఈసారి బద్వేలులో టీడీపీ జెండా ఎగురవేస్తామని యువనాయకుడు రితీష్‌రెడ్డి వ్యాఖ్యానిం చారు. అట్లూరు మండల వైసీపీ ఎంపీపీ పుత్తా రమాదేవి, మండల వైసీపీ ఇన్‌చార్జి రెడ్డయ్య ఆధ్వర్యంలో మండలంలోని 12 పంచాయతీలకు చెందిన 600 కుటుంబాలు మంగళవారం వైసీపీలో చేరాయి. అట్లూరు క్రాస్ రోడ్డులే నిర్వహించిన సమావేశంలో రితీష్‌రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అట్లూరు మండలంలో ప్రభుత్వ భూముల కబ్జా పరి పాటిగా మారిందన్నారు. ఎటువంటి అభివృద్ధి చేయకుండా దేనికి సిద్ధమయ్యారని వైపీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తా మన్నారు. తెలుగుగంగ కాల్వ పూర్తి చేసి అట్లూరు మం డల ప్రజలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. హూకిల్డ్ బాబాయి ఫ్లెక్సీలను ప్రదర్శించారు. బద్వేలు నియోజకవర్గ అభ్యర్ధి బొజ్జా రోశన్నకు ఓటు వేసి గెలిపించాలని కార్యకర్తలను కోరారు. అట్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ నరసింహనాయుడు, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ ప్రసాద్, శివయ స్వామిపాల్గొన్నారు.
మైలవరం: మండల పరిధిలోని చిన్నకొమెర్ల గ్రామంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాల వారిని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్ భూ పేశ్‌రెడ్డి మంగళవారం టీడీపీలోకి ఆహ్వానించారు. కర్నాటి రామాంజనేయరెడ్డి, కర్నాటి తిరు పాల్‌రెడ్డి, పోలా పుల్లారెడ్డి, పోలా పవన్‌కుమార్‌రెడ్డి, మునిప్రసాద్‌రెడ్డి, కె.ఎస్ రామాంజల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, అంకాల్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, గురురెడ్డి, సంజీవ రెడ్డి, మల్లికార్జునరెడ్డి, బబ్లూ, దామోదర్‌రెడ్డి, నారాయణ రెడ్డి, నారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మోహన్ రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, పాపిరెడ్డి, శివారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, శేఖర్, అమర్నాథ్‌రెడ్డి, మంగలి ప్రసాద్, పరమేశ్వర రెడ్డి, శంకర్‌రెడ్డి, గుర్రప్ప, వెంకటసుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డి, భరత్‌రెడ్డి, బార్గవరెడ్డి, నాగేంద్రారెడ్డి, జగదీశ్వరరెడ్డి తదిత రులు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, సీనియర్ నాయకులు కాటిరెడ్డి, కొండయ్య, పాపిరెడ్డి, సూర్యపెద్దిరాజు, మైలవరం రాజారెడ్డి, గణేష్‌రెడ్డి, జనసేన నాయ కులు నాగార్ఝున తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.