Share News

ఉర్దూ యూనివర్సిటీలో ప్రొఫెసరు పోస్టులు భ ర్తీ చేయాలి

ABN , Publish Date - Nov 04 , 2024 | 11:30 PM

డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసరు పోస్టులు భర్తీ చేయాలని రూటా అధ్యాపకులు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసీవుల్లా, రాష్ట్ర కోఆర్డినేటరు మహ్మద్‌ఆలీ డిమాండ్‌ చేశారు

ఉర్దూ యూనివర్సిటీలో ప్రొఫెసరు పోస్టులు భ ర్తీ చేయాలి

కడప (ఎడ్యుకేషన), నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసరు పోస్టులు భర్తీ చేయాలని రూటా అధ్యాపకులు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసీవుల్లా, రాష్ట్ర కోఆర్డినేటరు మహ్మద్‌ఆలీ డిమాండ్‌ చేశారు. సోమవారం వైస్‌చాన్సలర్‌ షేక్‌ షావల్లి ఖానకు వినతపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల్లో ఉన్నత విద్యాభివృద్ధికి మహోన్నతమైన ఉద్దేశ్యంతో చంద్రబాబు అబ్దుల్‌హక్‌ ఉర్దూ యూనివర్సిటీని స్థాపించారన్నారు. గత ఐదేళ్లలో యూనివర్సిటీ అభివృద్ధి చెందలేదని, ఇప్పటికైనా ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో సిరాజ్‌బుఖారి, నజీర్‌ అహ్మద్‌, పర్వేజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 11:30 PM