ప్రజలకు భాగస్వామ్యం కల్పించేందుకే పీటీఎం
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:50 PM
ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరిచే క్రమంలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) ఉద్దేశమని ఐసీడీఎస్ పీడీ, మండల ప్రత్యేకాధికారిణి శ్రీలక్ష్మి అన్నారు.
పులివెందుల రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరిచే క్రమంలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) ఉద్దేశమని ఐసీడీఎస్ పీడీ, మండల ప్రత్యేకాధికారిణి శ్రీలక్ష్మి అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 7న జరిగే మెగా పీటీఎం సమావేశంపై సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఈఓ చంద్రశేఖర్‌రావు, ఎంపీడీఓ రామాంజనేయరెడ్డి, డీఎల్‌పీఓ శ్రీరమాదేవితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ప్రయోజనాల కోసం వారి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు, అలాగే తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మాబున్ని తదితరులు పాల్గొన్నారు.