ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి: కమిషనర్
ABN , Publish Date - Nov 04 , 2024 | 11:32 PM
కడప కార్పొరేషన పరిధిలో ని ప్రజాసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ మనోజ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
కడప (ఎడ్యుకేషన), నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కడప కార్పొరేషన పరిధిలో ని ప్రజాసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ మనోజ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సో మవారం కార్పొరేషన వీడి యో కాన్ఫరెన్స హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 అర్జీలు వచ్చాయన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 7, రెవెన్యూ 5, టౌనప్లానింగ్ 4,హెల్త్ విభాగం 1, యుపీఏ 1 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు.