ఉపాధ్యాయుడి మృతికి కారకులను శిక్షించండి
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:09 AM
రాయచోటిలోని కొత్తపల్లె ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఇజాజ్ అహమ్మద్‌పై దాడి చేసి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సం ఘాల సమైఖ్య నాయకులు డిమాండ్ చేశారు.
ములకలచెరువు, డిసెంబరు 5 (ఆం ధ్రజ్యోతి): రాయచోటిలోని కొత్తపల్లె ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఇజాజ్ అహమ్మద్‌పై దాడి చేసి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సం ఘాల సమైఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవో వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఉపా ధ్యాయుడిపై డాడి చేసిన సంఘటన కలిచివేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమరనాధరెడ్డి, ఆదినారాయణ, శ్రీరాములు, రాజారెడ్డి, కృష్ణారెడ్డి, నాగరాజు, మహమ్మద్ రఫి, ఉమా, సుజాత, వసంతి, అనిత పాల్గొన్నారు.
మదనపల్లెలో ఫ్యాప్టో, యూటీఎఫ్ నాయకుల నిరసన..
మదనపల్లె అర్బన, డిసెంబరు 5(ఆం ధ్రజ్యోతి):రాయచోటిలో ఉపాధ్యాయు డిపై విద్యార్థులు దాడిచేసి ప్రాణాలు తీసిన సంఘటనపై మదనపల్లెలో ఫ్యాప్టో నాయకులు, యూటీఎప్ నాయకులు, ఉపాధ్యాలు పలు చోట్ల గురువారం నిరసన చేపట్టారు. ఇం దులో భాగంగా స్థానిక జడ్పీ హైస్కూ ల్ ఎదుట జరిగిన ఆందోళనలో నాయ కులు మాట్లాడుతూ విద్యార్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుడు ఏజాష్ అహమ్మద్ కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని, దాడిచేసిన వారి కఠినం గా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక నీరుగట్టువారిపల్లెఓని వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎదుట యూటీఎఫ్ జిల్లా కార్యరద్శి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఉపాధ్యాయుడి మరణంపై నిజానిజాలు వెలికి తీసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. హెచఎం సుబ్బారెడ్డి, ఎస్టీయూ నాయకులు రమణ, ఉపాఽధ్యాయులు పాల్గొన్నారు.
కలకడలో:రాయచోటి కొత్తపల్లె ఉర్దూ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎజాజ్‌అహ్మద్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఫ్యాప్టో నాయకులు డిమాండు చేశా రు. ఈ మేరకు వారు గురువారం ఎమ్మార్సీలో ఎంఈవో-2 రామచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు చెంగల్ రా యులు, శ్రీనివాసరావు, సదాశివరెడ్డి, సరస్వతమ్మ, అనిత, సుమిత్ర, రెడ్డిశేఖర్‌రెడ్డి, విశ్వనాథ్, సుబ్రమణ్యం, ఇర్పాన, నూరుల్లా, ఆంజినేయులు, శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
రామసముద్రంలో: ఉపాధ్యాయుడిపై దాడిచేసిన విద్యార్థులను కఠినంగా శిక్షిం చాలని ఎస్టీయూ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమేరకు గురువారం రామసముద్రం జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్య క్షుడు కడియాల మురళి, రామసముద్రం అధ్యక్షుడు ఆయుబ్‌ఖాన మాట్లాడుతూ రాయచోటిలో ఉపాధ్యాయుడు ఇజాజ్‌అహ్మద్ మృతి సంఘటన చాలా బాధాకర మన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈసంఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్ర మంలో మండల ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఆర్థిక కార్యదర్శి సురేష్ నాయకులు గాయత్రి, నరేంద్ర, షాహిర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.