Share News

ర్యాగింగ్‌ చట్టరీత్యా నేరం: జడ్జి

ABN , Publish Date - Oct 25 , 2024 | 10:44 PM

ర్యాగింగ్‌ చట్టరీత్యా నేర మని జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ సెక్రటరీ, సివిల్‌ జడ్జి బాబాఫకృద్దీన పేర్కొన్నారు.

ర్యాగింగ్‌ చట్టరీత్యా నేరం: జడ్జి
యాంటి ర్యాగింగ్‌ అబ్జర్వెన్స డేను ప్రారంభిస్తున్న జడ్జి, ప్రిన్సిపాల్‌

కడప సెవెనరోడ్స్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ర్యాగింగ్‌ చట్టరీత్యా నేర మని జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ సెక్రటరీ, సివిల్‌ జడ్జి బాబాఫకృద్దీన పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని ప్ర భుత్వ వైద్యకళాశాలలో ఎనఎ్‌సఎ్‌స యూనిట్‌ ఆధ్వర్యంలో యాంటి ర్యాగింగ్‌ అబ్జర్వెన్సడే నిర్వహించారు. అ లాగే అనంతరం నూతన వైద్యవిద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ సెక్రటరీ, సివిల్‌ జడ్జి బాబాఫకృద్దీన హాజరయ్యారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ ర్యాగింగ్‌ వల్ల కలిగే దుష్ఫలితాలు, దానికి విధించే శిక్షలను వివరించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సురేఖ, వైస్‌ ప్రిన్సిపాల్‌ విజయభాస్కర్‌, ప్రొఫెసర్‌ హా స్టలు వార్డెన సునీల్‌, ఎనఎ్‌సఎ్‌స ప్రోగ్రాం ఆఫీసరు రాజు దాసరి, వైద్యకళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 10:44 PM