Share News

డ్రోన కెమెరాలతో వర్షం ప్రభావం పరిశీలన

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:19 PM

వర్షం నేపథ్యంలో మండలంలోని అధికారులను కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌, అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన అప్రమత్తం చేశారు. డ్రోన కెమెరా లతో వరద ప్రాంతాలను, శెట్టిగుంట చెరువులోకి నీరు చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు.

డ్రోన కెమెరాలతో వర్షం ప్రభావం పరిశీలన
శెట్టిగుంట చెరువులోనికి చేరుతున్న నీరు

రైల్వేకోడూరు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): వర్షం నేపథ్యంలో మండలంలోని అధికారులను కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌, అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన అప్రమత్తం చేశారు. డ్రోన కెమెరా లతో వరద ప్రాంతాలను, శెట్టిగుంట చెరువులోకి నీరు చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు. రెడ్డివారిపల్లె బ్రిడ్జి వద్ద వరద నీరు రాకుండా చర్యలు తీసుకున్నారు. గతంలో నరసరాంపేటలో కూలిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. వరద ప్రభావితం చేసే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Oct 15 , 2024 | 11:19 PM