Share News

ఘనంగా రమాబాయి జయంతి వేడుకలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:01 PM

రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సతీమణి రమాబాయి 126వ జయంతిని బుధవారం పీలేరులో పలు ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించాయి.

ఘనంగా రమాబాయి జయంతి వేడుకలు
పీలేరు: రమాబాయికి నివాళులర్పిస్తున్న ప్రజాసంఘాల నేతలు

పీలేరు, ఫిబ్రవరి 7: రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సతీమణి రమాబాయి 126వ జయంతిని బుధవారం పీలేరులో పలు ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించాయి. చిత్తూరు మార్గంలోని కోళ్లఫారం వద్ద జరిగిన కార్యక్రమంలో బాస్‌, మాలమహానాడు, ఏపీ ఎమ్మార్పీఎస్‌ నాయకు లు మాట్లాడుతూ మాతా రమాబాయిని చరిత్ర ‘సింబల్‌ ఆఫ్‌ శాక్రిఫైస్‌’గా గుర్తు పెట్టుకుంటుందని, ఆమె చేసిన త్యాగాల కారణంగా డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రపంచం గ ర్వించదగ్గ మేధావిగా అవతరించారని కొనియా డారు. వేపులబైలు పంచాయతీ వరంపాటివారి పల్లెలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో ఎంఎస్‌పీ నేత గండికోట వెంకటేశ్‌ మాట్లాడు తూ కళ్ల ముందు కన్నబిడ్డలు కడతేరిపోతున్నా పుత్రశోకాన్ని దిగమింగి రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకున్న త్యాగశీలి రమాబాయి అని గుర్తు చేసుకున్నారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. పీలేరులోని గ్రేట్‌ విజన్‌ సొసైటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యుడు డా.జీవీఎస్‌ బాబు, ధనంజ య, డా.టి.రఘునాథ్‌, శ్రీరాములు రమాబాయి సేవలను స్మరించుకున్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో నాయకులు తుమ్మల ధరణీ కుమార్‌, పాలకుంట శ్రీనివాసులు, జెట్టి మల్లికా ర్జున, నగరిమడుగు సుభాష్‌, చీకటిపల్లె మలి ్లకార్జున, రెడ్డయ్య, సురేంద్ర, భువన్‌ కుమార్‌, పురుషోత్తం, నరసింహులు, చరణ్‌ కుమార్‌, శ్రీకాంత్‌, సాయివంశీ, భాను, అనిరుద్‌, ప్రవళ్లిక, సుస్మిత, మంజుల, నరసమ్మ, అనూరాధ, మీనా, కవిత, తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె అర్బన్‌: రాజ్యాంగ సృష్టికర్ల డాక్టర్‌ అంబేడ్కర్‌ సతీమణి రమాబాయి జయంతి వేడుకలు బాస్‌ కార్యాలయంలో బాస్‌, వీసీకే పార్టీ సంయుక్తంగా ఘనంగా నిర్వహించారు. రమా బాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఎంతో సహకరిం చిన రమాబాయి జీవితం గురించి వివరించారు. ఆమె చేసిన త్యాగం అమూల్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాకవి రెడ్డెప్ప, రెడ్డిప్రసాద్‌, రెడ్డెప్ప, సూరి, హైదర్‌, పవన్‌, తేజా, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:01 PM