Share News

దేశ సమైక్యత, సమగ్రత, ప్రగతిశీల పోరాటాలకు సిద్ధం

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:18 PM

దేశ సమైక్యత, సమగ్రత, ప్రగతిశీల పోరాటాలకు సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

దేశ సమైక్యత, సమగ్రత, ప్రగతిశీల పోరాటాలకు సిద్ధం
కడప నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

కడప సెవెన రోడ్స్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశ సమైక్యత, సమగ్రత, ప్రగతిశీల పోరాటాలకు సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా శనివారం సాయంత్రం కడప నగరంలోని సీపీఐ శ్రేణులు కోటిరెడ్డి సర్కిల్‌ (స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌) నుంచి పాత కలెక్టరేట్‌ వరకు ర్యాలీ, అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రగతిశీల పోరాటాలకు సీపీఐ ఎల్లప్పడూ సిద్ధమన్నారు. వివక్షత, అణచివేత, దోపిడీ లేని సమాజం కోసం సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం సాధనే సీపీఐ లక్ష్యమన్నారు. సీపీఐ 1925 డిసెంబరు 26న కాన్పూర్‌లో ఆవిర్భవించి 2024 డిసెంబరు 26 నాటికి వంద సంవత్సరాలు పూర్తిచేసుకొని శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటోంద న్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, నగర కార్యదర్శి ఎన.వెంకటశివ, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎన.విజయలక్ష్మి, మద్దిలేటి, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:18 PM