వర్షాలతో దెబ్బతిన్న వరి
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:47 PM
మదనపల్లె డివిజనలో గత మూడు రోజులుగా కురుస్తున్న జడివానలతో పెద్దమొత్తంలో వరిపం ట నేలవాలి దెబ్బతినింది.
మదనపల్లె డివిజనలో
836 హెక్టార్లలో నేలవాలిన పంట
రైతులకు అదనపు ఖర్చులు
ప్రత్యామ్నాయంపై
వ్యవసాయాధికారుల సూచనలు
మదనపల్లె టౌన, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మదనపల్లె డివిజనలో గత మూడు రోజులుగా కురుస్తున్న జడివానలతో పెద్దమొత్తంలో వరిపం ట నేలవాలి దెబ్బతినింది. రబీ సీజనకు ముందే డివిజనలోని ఎనిమిది మండలాల్లో రైతులు వరి పంట సాగు చేయగా ప్రస్తుతం వరి కోతదశలో ఉంది. ఈ క్రమంలో మూడు రోజులుగా కురుస్తు న్న వర్షాలతో నేలవాలిన వరిపంటను కాపాడుకు నేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. మదనపల్లె వ్యవసాయ డివిజనలో ఎని మిది మండలాలు ఉండగా వాటిలో మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, రామసముద్రం, బి.కొత్త కోట మండలాల్లో ఎక్కువగా రైతులు వరిపంట సాగు చేశారు. ఇందులో మదనపల్లె మండలంలో 324 హెక్టార్లు, నిమ్మనపల్లెలో 265, కురబలకో టలో 65, రామసముద్రంలో 32, బి.కొత్తకోట మం డలంలో 150 హెక్టార్లలో కలిపి మొత్తం 836 హెక్టార్లు(2,090 ఎకరాలు) వరిపంట వర్షాలతో నేలవాలిపోయింది. దీంతో పాటు 20 హెక్టార్లలో మొక్కజొన్న పంట కూడా పడిపోయింది. ఆరుగా లం కష్టపడి రైతులు సాగు చేసిన వరి ప్రస్తుతం వెన్నుదశలో ఉండగా మొక్కజొన్న మొలకలు ఎత్తే స్థితిలో ఉంది. ఈ క్రమంలో వరుస వర్షాల తో పంటను కాపాడుకోవడంలో రైతులు అష్టకష్టా లు పడుతున్నారు. కాగా సోమవారం మదనపల్లె ఏడీఏ శివశంకర్ మదనపల్లె మండలంలోని కొత్త పల్లె, బొమ్మనచెరువు, సందిరెడ్డిగారిపల్లె గ్రామా ల్లో దెబ్బతిన్న వరిపంటను పరిశీలించి, రైతులకు పలు సూచనలు అందజేశారు.
తుఫాన కారణంగా ఆగిన వరి కోతలు
పెద్దమండ్యం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి) తుఫా న కారణంగా మూడు రోజులుగా కురు స్తున్న వర్షాలకు వరి కోతలు పూర్తిగా ఆగిపో యాయి. నోటి కొచ్చిన పంటలు చేజారుతున్నా యని పెద్దమండ్యం మండల వరి రైతులు ఆం దోళన వ్యక్తం చేశారు. యంత్రాలతో వరి కోతలు పూరైన చోట ధాన్యం దెబ్బతిని తీవ్ర నష్టం కలిగించా యని వాపోతున్నారు. వర్షంలోనే వరి కోతలకు వెళ్లిన యంత్రాలు కొన్ని చోట్ల ఆక్కడే బురదలో ఇరుక్కుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. మరోపక్క టమోటా పంట కూడా ఈ తుఫా న తాకిడికి దెబ్బతినడంతో రైతుతు ఢీలా పడ్డారు. వరి కోతలు జరిపిన రైతులు ధాన్యం ఆరబోసి తగిన జాగ్రత్తలు పాటించాలని ఏవో సురేష్‌బాబు వెల్లడించారు. కాగా ఈ తుఫాన వర్షాల ధాటికి పెద్దమండ్యం సమీపం లోని పలు చెరువులు, కుంటలు నిండిపొర్లుతు న్నాయి. ఎగువ అడవి ప్రాంతంలో నుంచి ఎక్కు వగా నీటి ప్రవాహం రావడంతో కుషావతినది ప్రవాహం పెరిగి పెద్దమండ్యంలోని పాతచెరువు మొరవ పోతోంది. తుఫాన ఆగిన తర్వాత వరి పంట పరిస్థితులు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
ములకలచెరువులో: తంబళ్లపల్లె నియోజకవ ర్గంలోని వరి రైతులను ఫెంగల్ తుఫాను ముం చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల వరి పంట నీట మునిగింది. అలాగే పలు చోట్ల నేలకొరిగింది. పరిస్ధితి ఇలాగే కొన సాగితే వరి రైతులకు మరింతగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో సుమారు 300 ఎకరాల్లో వరిపంట సాగులో ఉం ది. పంట చేతికొచ్చే సమయంలో ఫెంగల్ తుఫా నుతో రెండు రోజులుగా ఏకధాటిగా వర్షం కురు స్తూనే ఉంది. మంగళవారం కూడా వర్షం కొనసా గితే వరి చేతికందే పరిస్ధితులు ఉండవని రైతులు చెబుతున్నారు.
నిమ్మనపల్లెలో నేల వాలిన పెద్ద వృక్షాలు
నిమ్మనపల్లె, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాన ధాటికి మూడు రోజులుగా ఎడతెర పి లేకుండా కురుస్తున్న వర్షానికి పంటలతో పాటు పెద్ద వృక్షాలు నేలకు ఓరిగాయి. సోమవారం ఏవో మురళిమోహన తుఫాన కారణంగా దెబ్బతి న్న వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మండలం లోని పది పంచాయతిలలోనూ నీట మునిగిన 285హెకార్లులో వరి పంటను పరిశీలించి నివేదిక ను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. కాగా తుఫాన ధాటికి వెంకోజిగారిపల్లి గ్రామంలో ఓ భారీ చింత చెట్టు నేలవాలింది. ఆ సమయం లో రెడ్డిబాబు అనే వ్యక్తి చిన్న పాటి గాయాలతో బయట పడ్డాడు. తుఫాన కారణంగా కురుస్తున్న వర్షంతో గృహాలు ఉరుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.