Share News

ప్రభుత్వ నిధులతో ఆలయానికి రోడ్డు

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:45 PM

మండల కేంద్రానికి సమీపంలోని పెద్దబలిజపల్లెలో సంక్రాంతి పండుగ నిర్వహించుకునే కాటమరాజు ఆలయం (చిట్లా కుప్ప) దగ్గరకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన నాయకుడు రామాశ్రీనివాసులు తెలిపారు.

ప్రభుత్వ నిధులతో ఆలయానికి రోడ్డు
రోడ్డు పనులు ప్రారంభిస్తున్న దృశ్యం

సుండుపల్లె, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి సమీపంలోని పెద్దబలిజపల్లెలో సంక్రాంతి పండుగ నిర్వహించుకునే కాటమరాజు ఆలయం (చిట్లా కుప్ప) దగ్గరకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన నాయకుడు రామాశ్రీనివాసులు తెలిపారు. గ్రామస్తులు ఎంతో సంబరంతో సంక్రాంతి ఉత్సవాలను నిర్వహించుకుంటారని, సరైన రోడ్డు వసతి లేక రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి మండల నిధులతో రోడ్డు పనులు ప్రారంభిస్తున్నామన్నారు. సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నంద్యాల రామయ్య, శివశంకర్‌, నంద్యాల సిద్ద, రెడ్డిచర్ల నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 11:45 PM