Share News

రైతులకు సౌకర్యంగా రైతుబజార్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:17 PM

మదనపల్లె పట్టణంలో ఆదునీకరించిన రైతు బజార్‌లో రైతులు, వ్యాపారులకు అన్ని సౌక ర్యాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే షాజహా నబాషా పేర్కొన్నారు.

రైతులకు సౌకర్యంగా రైతుబజార్‌
రైతుబజార్‌లో సౌకర్యాలను పరిశీలించి అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా

తోపుడుబండ్లకు గేట్లు లేవు రైతుబజార్‌ పరిశీలనలో ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, అక్టోబరు 22( అంధ్రజ్యోతి): మదనపల్లె పట్టణంలో ఆదునీకరించిన రైతు బజార్‌లో రైతులు, వ్యాపారులకు అన్ని సౌక ర్యాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే షాజహా నబాషా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రైతు బజార్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడ ఏర్పాట్లు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఉత్పత్తి చేసే కూరగాయలు, ఫలాలు, ఆకు కూరలు, పాల ఉత్పత్తులు తదితర వాటికి రైతుబజార్‌లో గేట్లు, రుసుం వసూలు చేయ రన్నారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను రైతులకు ఉచితంగా కేటాయిస్తార న్నారు. మాంసం దుకాణాలు, చేపల దుకా ణాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్న వారికి, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి స్టాళ్లు అద్దెకు నెలకు రూ.4వేలతో పాటు రూ.50వేలు డిపాజిట్‌ చెల్లించాలన్నారు. రైతుబజార్‌లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుధ్య పనులను మున్సిపాలిటీ సిబ్బంది చూసుకుం టారన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ ఏడీఎం త్యాగరాజు మాట్లాడుతూ రైతు బజార్‌లో స్టాళ్ల కేటాయింపుపై జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వ ర్యంలో లాటరీ పద్ధతిలో రైతులకు కేటాయి స్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, టీడీపీ నాయకులు ఎస్‌ఏ మస్తాన, కౌన్సిలర్‌ నాగార్జునగాంధీ తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:17 PM