క్రీడా మైదానాన్ని కాపాడండి
ABN , Publish Date - Sep 05 , 2024 | 11:37 PM
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలోని క్రీడా మైదానం ఆక్రమణకు గురికాకుండా చూడాలని కళాశాల విద్యార్థులు ర్యాలీ చేయడంతో పాటు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
జూనియర్ కళాశాల విద్యార్థుల ధర్నా
వీరబల్లి, సెప్టెంబరు 5: ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలోని క్రీడా మైదానం ఆక్రమణకు గురికాకుండా చూడాలని కళాశాల విద్యార్థులు ర్యాలీ చేయడంతో పాటు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 ఏళ్ల కిందట కళాశాల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఆ సమయంలో ఎవ్వరూ రాకుండా ప్రస్తుతం తమ స్థలం ఉందంటూ హద్దురాళ్లు నాటడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సర్వే చేపట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. తమకు దాతలు ఇచ్చిన 11.20 ఎకరాలకు సంబంధించి ధ్రువపత్రాలు ఉన్నాయని తహసీల్దార్ శ్రావణిని తెలియజేశారు. కాగా కళాశాల వద్ద నాటిన హద్దుల రాళ్లు తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పీఆర్‌సీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకు రవీంద్ర తెలిపారు. తహసీల్దార్ శ్రావణి మాట్లాడుతూ కళాశాల స్థలాన్ని ఎవ్వరూ ఆక్రమించలేదని, తగిన న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.