Share News

వైజ్ఞానిక ప్రదర్శనలు సాంకేతికతకు తోడ్పాటు

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:51 PM

సైన్స వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులలో సాంకేతిక ప్రగతి సాధ్య మవుతుందని ఎంఈవోలు త్యాగరాజు, నాగసుబ్బరాయుడు పేర్కొన్నారు.

 వైజ్ఞానిక ప్రదర్శనలు సాంకేతికతకు తోడ్పాటు
సైన్స ప్రదర్శనను తిలకిస్తున్న ఎంఈవోలు, ఎస్‌ఎంసీ చైర్మన

తంబళ్లపల్లె, డిసెంబరు 30(ఆంధ్రజ్యో తి): సైన్స వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులలో సాంకేతిక ప్రగతి సాధ్య మవుతుందని ఎంఈవోలు త్యాగరాజు, నాగసుబ్బరాయుడు పేర్కొన్నారు. సో మవారం స్థానిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి సైన్స మేళాను ఎంఈవోలు, ఎస్‌ఎంసీ చైర్మన శివకుమార్‌ ప్రారంభించారు. ఈ మేళా లో మండలంలోని ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొని రూపొం దించిన సైన్స ప్రాజెక్టులను ప్రదర్శించారు. వారిలో వ్యక్తిగత కేటగిరిలో మహాత్మా జ్యోతిరావు పూలేబీసీ పాఠశాల విద్యార్థి శేషాద్రి ప్రదర్శించిన ఽఽథర్డ్‌ ఐ బ్లైండ్‌ ప్రాజె క్టు, గ్రూప్‌ కేటగిరిలో కన్నెమడుగు ఉన్నత పాఠశాల విద్యార్థి వర్షిత, దీపిక ప్రద ర్శించిన వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులు జిల్లా స్థాయికి ఎంపిక అయినట్లు ఎంఈవో తెలిపారు. సైన్స మేళాలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ మణి, హెచఎం శ్రీనివాసులు, గైడ్‌ టీచర్లు నాగలక్ష్మీ, పీఎస్‌ఎల్‌ఎన శాసి్త్ర, సీఆర్పీలు విద్యార్థులు పాల్గొన్నారు.

ములకలచెరువులో: మండలంలోని బురకాయలకోట జడ్పీ హైస్కూల్‌లో సోమవారం మండల స్ధాయి వైజ్ఙానిక ప్రదర్శనలో విద్యార్ధులు పలు నమూనా లు ప్రదర్శించారు. ఉత్తమ నమూనాలు ప్రదర్శించిన బురకాయలకోట గురకుల పాఠశాల విద్యార్ధి శైలజ, జడ్పీ హైస్కూల్‌ విద్యార్ధులు అఫ్రా, ప్రనీతరెడ్డి, గీతాంజలి కు ఎంఈవోలు వెంకటరమణ, శంకరయ్యలు జ్ఞాపికలు, బహుమతులు అంద జేశారు. ఈ కార్యక్రమంలో హెచఎం నాగమోహనరెడ్డి, ఉపాధ్యాయులు రెడ్డిరాధా, మల్లేశ్వరి, మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కురబలకోటలో: విద్యార్థులు భావిభారత శాస్త్త్రవేత్తలుగా ఎదగాలని ఎంఈవో ద్వారకనాధ్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని అంగళ్ళు జడ్పీహైస్కూల్‌లో మండల స్థాయి సైన్సఫేర్‌లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక నైపు ణ్యాలను మెరుగుపరచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు చేట్టిన నమూన ప్రయోగాలు పలువురిని ఆకట్లుకున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.

రామసముద్రంలో: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స వైజ్ఞానిక ప్రదర్శనలో ఎంఈవో ఆంజనేయులు, హెచఎం బిట్టిబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతతూ విద్యార్థులు సైన్స పట్ల అవగాహన పెంచుకుని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:51 PM