ఏపీఎంఎస్ ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎంపిక
ABN , Publish Date - Sep 16 , 2024 | 11:50 PM
స్థానిక ఎస్టీయూ భవనలో ఎపీఎంఎస్ ఎస్టీయూ అన్నమయ్య, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు.
మదనపల్లె అర్బన, సెప్టెంబరు 16: స్థానిక ఎస్టీయూ భవనలో ఎపీఎంఎస్ ఎస్టీయూ అన్నమయ్య, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. మదనప ల్లెలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా చెన్నూరిబాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మోహనమురళి, ట్రెజరర్‌గా కేపీ నాగరాజన, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎం. శ్రీనునాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా శెట్టిపల్లె శివకుమారి, జిల్లా కార్యదర్శిగా సీహెచ యోజన గంది, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా కె. విజయలక్ష్మీ, ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్య క్షుడు మోహనరెడ్డి మాట్లాడుతూ ఆదర్శ పాఠశాల్లోని ఉపాధ్యాయులకు 010 ద్వారా జీతాలు చెల్లిస్తున్నందున ఆదర్శ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేసినందులకు వెంటనే సర్వీస్ రూల్స్నుఅమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునిరత్నం మాట్లాడుతూ ఉపాధ్యాయులకు వెంటనే హెల్త్ కార్డులు, మెడికల్ రీయిం బర్స్మెంట్ కల్పించాలని కోరారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోకల మధుసూదన, జగనమోహనరెడ్డి మాట్లాడుతూ ఆదర్శ పాఠశాల్లో ఉపా ధ్యాయుల బదిలీలు నిర్వహించాలని, పాఠశాల్లో ఖాళీలను వెంటనే భర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్స్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.