పులివెందుల మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా శ్రీదేవి
ABN , Publish Date - Jan 17 , 2024 | 11:16 PM
అనంత వైద్య కళా శాల వైద్యశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి పులివెం దుల మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగోన్నతి పొందారు.
అనంతపురం టౌన్, జనవరి 17: అనంత వైద్య కళా శాల వైద్యశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి పులివెం దుల మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగోన్నతి పొందారు. ఇక్కడి ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ ఉద్యోగ విరమణ పొందగా ఏడు నెలలు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ప్రస్తుతం డాక్టర్ శ్రీదేవిని పులి వెందుల మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమి స్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో బుధవారం ఆమెను అనంత వైద్య కళాశాలలో ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యాల రావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, షారోన్ సోనియా, కళాశాల వైద్యులు శ్యాంప్రసాద్, శంషాద్ బేగం, సంధ్య, సుచిత్రశౌరి, సరళ, దుర్గ, శంకర్, మధు సూదన్, వాల్మీకి శ్రీనివాస్, నిహారిక, సుమాస్ చంద్రబోస్, సుచన, ఎన్‌ఎస్ ఎస్ పోగ్రాం ఆఫీసర్ పరదేశీనాయుడు పాల్గొన్నారు.