Share News

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేవరకు పోరాటం

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:34 AM

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏ ర్పాటు చేసేవరకు పోరాటం చేస్తామని ఉక్కుసాధన ఐక్యవేదిక జిల్లా నాయకుడు చంద్రశేఖర్‌ అన్నారు.

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేవరకు పోరాటం
నిరసన తెలుపుతున్న ఐక్యవేదిక నాయకులు

ఉక్కు సాధన ఐక్యవేదిక జిల్లా కన్వీనరు చంద్రశేఖర్‌

కడప సెవెనరోడ్స్‌/నాగరాజుపేట,డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏ ర్పాటు చేసేవరకు పోరాటం చేస్తామని ఉక్కుసాధన ఐక్యవేదిక జిల్లా నాయకుడు చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం బీఆర్‌ అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఉక్కు సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు రామమోహన, సుబ్బమ్మ, మనోహర్‌, దస్తగిరి, కామనూరు శ్రీనివాసులరెడ్డి, అన్వేష్‌, రామక్రిష్ణారెడ్డి, కుమారస్వామిరెడ్డి, గోపాలక్రిష్ణయ్య, వెంకటసుబ్బయ్య, శివకుమార్‌ పాల్గొన్నారు.

ఉక్కు పరిశ్రమను విస్మరిస్తున్న బీజేపీ

కడప నాగరాజుపేట, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) :కడప ఉక్కు పరిశ్రమను బీజేపీ విస్మరిస్తోందని గ్రేటర్‌ రాయలసీమ విద్యార్థి, యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి డీఎం ఓబులేసు అన్నారు. గురువారం ఆ కార్యాలయంలో వాల్‌పోస్టర్‌ విడుదల చేశా రు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నవీన, జిల్లా ఉపాద్యక్షులు నాగ మల్లయ్య, నగర కార్యవర్గసభ్యులు మురళీక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 12:34 AM