మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:16 PM
కమలాపురం బాలికల ఉన్నత పాఠశాల లో జరిగిన మండల స్థాయి విజ్ఞాన సైన్స ప్రదర్శనలో పలు పా ఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ఎంఈవో సుభాషిణి తెలిపారు.
కమలాపురం రూరల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : కమలాపురం బాలికల ఉన్నత పాఠశాల లో జరిగిన మండల స్థాయి విజ్ఞాన సైన్స ప్రదర్శనలో పలు పా ఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ఎంఈవో సుభాషిణి తెలిపారు. శనివారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో విజ్ఞాన సైన్స ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఉద యం నుంచి మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించిన రిజిస్ట్రేషన ప్రక్రియ ప్రారంభించారు. తదుపరి 10 గంటలకు ప్రా ర్థన కార్యక్రమం జరిగింది. కమలాపురంలో నిర్వహించిన మండలస్థాయి వైజ్ఞానిక సైన్స కార్యక్రమానికి మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన పరికరాలను ప్రదర్శించారు. విజేతలకు ఎంఈవో సుభాషిణి, జడ్పీహెచఎ్‌స పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన.సరస్వతి, జడ్పీహెచఎ్‌స బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఖాజాపర్వీన బహుమతులను ప్ర దానం చేశారు.