రోడ్లపై బైకులతో స్టంట్‌లు చేస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Oct 01 , 2024 | 12:07 AM
లైసెన్సులు లేకుండా, మైనార్టీ తీరకుండా రోడ్లపై వాహనాలు తెచ్చి వేగంగా తిరుగుతూ, స్టంట్‌లు వే స్తూ ఎదుటి వారికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా చర్యలు తప్పవని కడప ఇనచార్జ్ డీఎ స్పీ రమాకాంత తీవ్రంగా హెచ్చరించారు.
ఇనచార్జ్ డీఎస్పీ రమాకాంత
కడప (క్రైం), సెప్టెంబరు 30 : లైసెన్సులు లేకుండా, మైనార్టీ తీరకుండా రోడ్లపై వాహనాలు తెచ్చి వేగంగా తిరుగుతూ, స్టంట్‌లు వే స్తూ ఎదుటి వారికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా చర్యలు తప్పవని కడప ఇనచార్జ్ డీఎ స్పీ రమాకాంత తీవ్రంగా హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో యు వత రోడ్లపై ద్విచక్ర వాహనాల స్టంట్‌లు ఎక్కువగా చేస్తున్నారని, అమ్మాయిలు కనబడగానే వారి ముందు ఫోజ్‌లు కొడుతూ బండిని ఇంకా పైకి ఎత్తి లేపుతూ స్పీడ్‌గా వాహనాలు నడుపుతున్నారన్నారు. రోడ్ల పై స్టంట్‌లు వేస్తూ పోలీసులకు పట్టుబడితే బండిని సీజ్ కూడా చేస్తామని హెచ్చరించారు. కడప రిమ్స్ పోలీసుస్టేషనలో సోమవా రం రోడ్లపై బైకులతో పలురకాల స్టంట్‌లు వేస్తూ విన్యాసాలు చే స్తున్న యువకులను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై ఇలా స్టం ట్‌లు చేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు ప్రమాదమని, అంతేకాక ఎదుటి వారికి కూడా ప్రమాదాలు తెచ్చి పెడతారని అన్నారు. అంతేకాక అదృష్టం బాగుండి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా వికలాంగులుగా మారి దుర్భర జీవితం అనుభవించాల్సి వస్తుందని అన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పిల్లలను అతి గారాభం చేసి మైనార్టీ తీరకుండానే వారికి ద్విచక్రవాహనాలను కొనివ్వకూడదన్నారు. ఇందులో తల్లిదండ్రుల తప్పు కూడా ఉందన్నారు. పెద్దలు కూడా ట్రాఫిక్‌పై అవగాహన లేకపోవడంతో ఇష్టానుసారంగా బండ్లు నడుపుతున్నారని ఇది మంచి పద్దతికాదన్నారు. పద్దతులు మార్చుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.