Share News

పట్టణ ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:43 PM

పట్టణ ఆరోగ్య కేంద్రాల ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నమ య్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్‌ పర్యవేక్షణ అధికారి (డీపీఎంవో) డాక్టర్‌ రియాజ్‌బేగ్‌ సూచించా రు.

పట్టణ ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
సేవలపై ఆరాతీస్తున్న డీపీఎంవో డాక్టర్‌ రియాజ్‌బేగ్‌

రాయచోటిటౌన్‌, మార్చి16: పట్టణ ఆరోగ్య కేంద్రాల ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నమ య్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్‌ పర్యవేక్షణ అధికారి (డీపీఎంవో) డాక్టర్‌ రియాజ్‌బేగ్‌ సూచించా రు. శనివారం ఆయన డిస్ర్టిక్ట్‌ న్యూక్లియస్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి కొత్తపల్లె పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సంఖ్య పెంచా లని, ఆశ కార్య కర్తల ద్వారా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించు సేవలపై ప్రతి ఇంటికి సమాచారం అందించాలని కోరారు. ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని నెలవారీ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి రోగు లకు కావాల్సిన సౌకర్యాలపై తీర్మానాన్ని చేసి నిధులు ఖర్చులు చేయాలని ఆదేశించారు. రోగులకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని, ఓఆర్‌ఎస్‌ కార్నర్‌ ఏర్పాటు చేయాలని, ఆశ కార్యకర్తలు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్స్‌ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. డాక్టర్‌ అల్తాఫ్‌, పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 10:43 PM