Share News

పులివెందుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లా

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:41 PM

పులివెందుల సమస్యలను ముఖ్యమం త్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, రెండు నెలల్లో అన్నీ సర్దుకుంటాయని పులివెందుల టీడీపీ ఇనచార్జి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు.

పులివెందుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లా

రెండు నెలల్లో అన్నీ సర్దుకుంటాయి: నియోజకవర్గ ఇనచార్జ్‌ బీటెక్‌ రవి

వేంపల్లె, అక్టోబరు 29 (ఆంధ్రోజ్యోతి): పులివెందుల సమస్యలను ముఖ్యమం త్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, రెండు నెలల్లో అన్నీ సర్దుకుంటాయని పులివెందుల టీడీపీ ఇనచార్జి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లెలోని ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట ఆయన మొక్క లు నాటారు. మండల పరిషత సభాభవనంలో సబ్సిడీ విత్తనాలను రైతులకు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా సమావేశంలోను, అనంతరం విలేకరులతోను బీటెక్‌ రవి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడే సమయంలో కౌంటింగ్‌ జరిగిన వెంటనే డీలర్‌షి్‌పలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ట్రిపుల్‌ఐటీలో మెస్‌లు, వాటర్‌ప్లాంట్‌లు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నారని, టీడీపీ కార్యకర్తలకు ఇప్పటికీ కొన్నిచోట్ల ఇప్పించుకోలేని పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇలా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, వీటిని సరిచేయాలని కోరానన్నారు. పులివెందుల నుంచే క్రమశిక్షణ మొదలవుతుంది, రెం డు నెలలు ఓపికపట్టండి, అందరికి న్యాయంజరుగుతుందని బాబు భరోసా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మునిరెడ్డి, మైనార్టీ కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ షబ్బీర్‌, జిల్లా గ్రంథాలయమాజీ చైర్మన బాలస్వామిరెడ్డి, రాష్ట్ర రైతు నాయకులుజగన్నాథరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు రామగంగిరెడ్డి, యువనాయకులు రజనీకాంతరెడ్డి, వేమ, పసుపులేటి వీరభద్ర, గండి మాజీచైర్మన వెంకటస్వామి, జిల్లా మాజీ కార్యదర్శి ఎద్దుల శేషారెడ్డి, బాలకృష్ణారెడ్డి, సింగారెడ్డి శివకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 11:41 PM