Share News

YS Jagan: జగన్‌లో మొదలైన టెన్షన్.. అవినాష్‌కు వార్నింగ్

ABN , Publish Date - Dec 17 , 2024 | 12:23 PM

Andhrapradesh: కడప జిల్లాకు చెందిన 8 మంది కార్పోరేటర్లు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే మరో 11 మంది కూడా త్వరలో చేరుతారన్న సమాచారం జగన్ రెడ్డికి చేరింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి వెంటనే అలర్ట్ అయ్యారు. ఇకపై ఎవరూ కూడా పార్టీని వీడకుండా ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

YS Jagan: జగన్‌లో మొదలైన టెన్షన్..  అవినాష్‌కు వార్నింగ్
YS Jaganmohan Reddy

కడప, డిసెంబర్ 17: ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jaganmohan Reddy) షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు సొంత పార్టీ నేతలు. జగన్ వ్యవహర శైలి నచ్చకనో లేక, తమ భవిష్యత్తు కోసం అనేక మంది నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. వారిలో పార్టీ ముఖ్యనేతలు కూడా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌కు ముఖ్యులుగా వ్యవహరించిన పలువురు నేతలు వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కార్పోరేటర్లు మొదలుకుని ఎంపీల వరకు ఇదే బాటలో ఉన్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోవడంతో.. మిగిలిన వారిని ఎలా కాపాడుకోవాలనే యోచనలో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. జగన్ సొంత జిల్లా కడపలోనూ అదే పరిస్థితి నెలకొంది. జగన్ సొంత జిల్లాకు చెందిన కార్పోరేటర్లు వైసీపీకి గుడ్‌ చెప్పి టీడీపీలో చేరడం జగన్ పెద్ద షాకే అని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారంపై జగన్ రెడ్డి తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం.

Jogi Ramesh Presence : టీడీపీలో ‘జోగి’ రచ్చ


నిన్న (సోమవారం) కడప జిల్లాకు చెందిన 8 మంది కార్పోరేటర్లు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే మరో 11 మంది కూడా త్వరలో చేరుతారన్న సమాచారం జగన్ రెడ్డికి చేరింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి వెంటనే అలర్ట్ అయ్యారు. ఇకపై ఎవరూ కూడా పార్టీని వీడకుండా ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను ఎంపీ అవినాష్ రెడ్డికి అప్పగించినట్లు పార్టీ వర్గాల టాక్. ఇక ఎవ్వరినీ కూడా పార్టీని వీడకుండా చూడాలని ఎంపీ అవినాష్ రెడ్డికి ఫోన్ ద్వారా జగన్ రెడ్డి గట్టిగానే చెప్పినట్లు సమాచారం. సొంత అడ్డా కడప కార్పోరేషన్ టీడీపీ చేతిలోకివెళితే.. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందని ఎలాగైనా సరే కాపాడాలని అవినాష్‌ రెడ్డికి జగన్ రెడ్డి గట్టిగా చెప్పినట్లు సమాచారం . అయితే పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి కోసం కూడా.. వారు పార్టీని వీడకుండా గట్టిగా ప్రయత్నించానని.. అయినా కూడా చేజారిపోయారని జగన్‌కు ఎంపీ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే మిగిలిన కార్పోరేటర్లు పార్టీని వీడకుండా చూస్తానని అన్న జగన్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.

ఈ ఏడాదిలో ఏపీలోనే సెన్సేషనల్ కేసు ఇది..


వరుస రాజీనామాలు..

కాగా.. నాలుగు రోజుల క్రితమే ఇద్దరు ముఖ్యనేతలు వైఎస్సార్సీపీకి ఊహించని షాకే ఇచ్చారు. ఈనెల 12న పార్టీ సీనియర్ నేత అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటూ వెళ్తూ వెళ్తూ పార్టీపై, మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే రోజు సాయంత్రం వైసీపీకి చెందిన మరో గ్రంధి శ్రీనివాస్‌ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పేయడం హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే సామినేని ఉదయ్ బాను, బాలినేని శ్రీనివాస్, కిలారు రోశయ్య, ఆళ్లనాని లాంటి నాయకులతో పాటు ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్‌ బై చెప్పేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

టీడీపీలో ‘జోగి’ రచ్చ

తండ్రీకొడుకులకు బిగ్ షాక్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 02:48 PM