ఊపందుకున్న టీడీపీ సభ్యత్వ నమోదు
ABN , Publish Date - Nov 04 , 2024 | 11:27 PM
మండలంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు ఊపందుకుంది.
చెన్నూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు ఊపందుకుంది. సోమవారం చెన్నూరుతో పాటు రామనపల్లె, కొండపేట, ఉప్పరపల్లె, గుర్రంపాడు గ్రామాల్లో ఆయా ప్రాంత నేతలు సభ్యత్వ నమోదును వేగవంతం చేశారు. మండల క్లస్టర్ ఇనచార్జ్ బుజ్జన్న, బీసీ సెల్ అధికార ప్రతినిధి వేల్పుల సుబ్రమణ్యం, ఐటీడీపీ చాంపియన వేముల మణికంఠ, నియోజకవర్గ విశ్వబాహ్మణ సంఘం అధ్యక్షుడు భవానీ ఆచారి, కొండపేటలో మాజీ సర్పంచలు మోహనరెడ్డి, ఆర్.సుధాకర్‌రెడ్డి, సంజీవ్‌పవన ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. చెన్నూరులో మండల కన్వీనరు కె.విజయభాస్కర్‌రెడ్డి, మాజీ జిల్లా అధికార ప్రతినిధి శివారెడ్డి, జిల్లా మైనార్టీ నాయకులు షబ్బీర్‌హుసేన, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి, రామనపల్లెలో జిల్లా అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్, గుర్రంపాడులో తెలుగుయువత జిల్లా అధికార ప్రతినిధి ముండ్ల శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వం చేపట్టారు.