టీడీపీ సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలి
ABN , Publish Date - Oct 24 , 2024 | 11:45 PM
టీడీపీ సభ్యత్వ నమోదును ఉద్యమం గా చేపట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు సూచించారు.
తంబళ్లపల్లెను ప్రథమ స్ధానంలో నిలపాలి
జయచంద్రారెడ్డికి జిల్లా అధ్యక్షుడు జగనమోహనరాజు సూచన
ములకలచెరువు, అక్టోబరు 24(ఆంధ్రజ్యో తి):టీడీపీ సభ్యత్వ నమోదును ఉద్యమం గా చేపట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు సూచించారు. ములకలచెరువులో గురువారం ఆయన తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డితో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వతేదీ నుంచి ప్రారంభం కానున్న టీడీపీ సభ్యత్వ నమోదులో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని జిల్లాలోనే ప్రధమ స్ధానంలో నిలపాలన్నారు. సభ్యత్వ నమోదును పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడు మల్లికార్జుననా యుడు, టీడీపీ నేత మంత్రి గిరిధర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి యర్రగుడి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన కేవీ రమణ, నాయకులు విశ్వనాధరెడ్డి, భజంత్రి రామాంజులు, బత్తుల శ్రీనివాసులు పాల్గొన్నారు.