ఉపాధ్యాయుడి మృతి బాధాకరం: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:31 AM
రాయచోటి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు అహ్మద్ మృతి బాధాకరమని, రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.
కడప ఎడ్యుకేషన, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రాయచోటి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు అహ్మద్ మృతి బాధాకరమని, రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మృతుడి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అహ్మద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందన్నారు.
మంత్రి లోకేశ ఫోను ద్వారా పరామర్శ
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ ఫోను చేసి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిచారు.అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఎస్టీయూ వినతి:అహ్మద్ కుటుంబానికి న్యాయం చే యాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియా్‌స బాషా రాష్ట్ర నాయకులు బాలగంగారెడ్డి కోరారు. శుక్రవారం మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.