తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
ABN , Publish Date - Oct 05 , 2024 | 11:59 PM
రామసముద్రం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మదనపల్లె సబ్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ శనివారం ఆక స్మికంగా తనిఖీ చేశారు.
రామసముద్రం, అక్టోబరు 5: రామసముద్రం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మదనపల్లె సబ్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ శనివారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. 22ఏ, ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. కార్యాలయానికి సంబంధించిన వివరాలను తహసీల్దార్ నిర్మలాదేవిని అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో భద్రపచిరిన రికార్డులు, వీడియో కాన్ఫరెన్స గదులను పరిశీలించారు. అంతకు ముందు మండలంలోని కాప్పల్లె పంచాయతీలో సర్వే నెంబర్ 146లో 58సెంట్లకు సంబంధించి ల్యాండ్ కన్వెన్షన భూమిని పరిశీలిం చారు. మండలంలోని కమ్మవారిపల్లెకు చెందిన ఓ రైతు తనకు సంబం దించి సర్వే నెంబరు 101/7లో 1.36సెంట్ల భూమిలో 36 సెంట్లు అన్యా క్రాంతమైందని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సబ్ కలెక్టర్ సంబంధించిన వీఆర్వోను వివరణ కోరగా ఆ భూమిపై ఇరుపక్షాలు కోర్టుకు వెళ్లారని తెలిపారు. అనంతరం సబ్‌కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద భూములను వీఆర్వో, తహసీల్దార్ సమక్షం లో పూర్తి వివరాలు సమర్పించి పరిష్కరించుకోవాలన్నారు.