తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం
ABN , Publish Date - Oct 26 , 2024 | 11:50 PM
కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి శనివారం ప్రారంభించారు.
కడప ఎడ్యుకేషన, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి శనివారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వ నమోదు 2024-26 కార్యక్రమాన్ని ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యా ప్తంగా ప్రారంభించారన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసిందని, ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు పొంది లబ్ధి పొందాలన్నారు. పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు. సభ్యత్వ నమోదు పొందడం వల్ల రూ.5లక్షలు ప్రమాద బీమా అవకాశం ఉందన్నారు.