AP News: సాగునీటి సంఘాల ఎన్నికలు.. ఉద్రిక్తం
ABN , Publish Date - Dec 14 , 2024 | 01:28 PM
Andhrapradesh: పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్ ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. వారికి బలమున్న ప్రతిచోట వైసీపీ శ్రేణులు గొడవులకు దిగుతున్నారు. టీడీపీ వారిని గొడవులకు రెచ్చగొడుతున్నారు. అట్లూరు మండలంలో కమసముద్రం గ్రామంలో టీడీపీ వారిపై తొడలు కొడుతూ మరీ వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టేందుకు వైసీపీ వర్గాలు యత్నిస్తున్నాయి. దీంతో గొడవలకు జరుగకుండా వైసీపీ వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.
కడప, డిసెంబర్ 14: జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగునీటి సంఘాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్ ప్రాంతాల్లో వైసీపీ (YSRCP) శ్రేణులు రెచ్చిపోతున్నారు. వారికి బలమున్న ప్రతిచోట వైసీపీ శ్రేణులు గొడవులకు దిగుతున్నారు. టీడీపీ వారిని గొడవులకు రెచ్చగొడుతున్నారు. అట్లూరు మండలంలో కమసముద్రం గ్రామంలో టీడీపీ వారిపై తొడలు కొడుతూ మరీ రెచ్చగొట్టేందుకు వైసీపీ వర్గాలు యత్నిస్తున్నాయి. దీంతో గొడవలు జరుగకుండా వైసీపీ వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.
వైసీపీకి పట్టు ఉన్న జమ్మలమడుగులోని పెద్దమూడెం, బద్వేల్‌లోని అట్లూరు, పులివెందులలోని వేముల ప్రాంతాల్లో ఆ పార్టీ శ్రేణులు.. టీడీపీ వారిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిన్న(శుక్రవారం) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటనతో వేమూరులో ఉద్రిక్తత వాతవరణం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికలు అయ్యేంత వరకు గృహనిర్బంధంలోనే ఉండాలంటూ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.
అల్లు అర్జున్ ఒక రాత్రి జైలు జీవితం ఇలా..
అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని గుండ్లకుంట జడ్పీ స్కూల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. ఘటన స్థలంలో వీడియోలు తీస్తున్న మీడియాపై ఓ వైసీపీ నేత దుర్భాషలాడారు. నోటికొచ్చినట్టు బండ బూతులతో మీడియాపై వైసీపీ నేత రెచ్చిపోయాడు. అయితే పోలీసుల రంగ ప్రవేశంతో చేయడంతో గొడవ సర్దుమణిగింది.
అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని గుండ్లకుంట జడ్పీ స్కూల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. ఘటన స్థలంలో వీడియోలు తీస్తున్న మీడియాపై ఓ వైసీపీ నేత దుర్భాషలాడారు. నోటికొచ్చినట్టు బండ బూతులతో మీడియాపై వైసీపీ నేత రెచ్చిపోయాడు. అయితే పోలీసుల రంగ ప్రవేశంతో చేయడంతో గొడవ సర్దుమణిగింది.
నెల్లూరులో ఉద్రికత్త..
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాల ఏఎస్ పేట మం పెద్దఅబ్బీపురం సాగునీటి సంఘాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతచోటు చేసుకుంది. సిస్తు ఫామ్‌పై ఎమ్మార్వో సంతకం లేదంటూ తమ ఓట్లను రిజెక్ట్ చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. వీఆర్వో సంతకం ఉన్నా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని అధికాలతో జనసేన నాయకులు వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించి జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Nara Lokesh: విద్యారంగంలో సంస్కరణలు తప్పవు
మీడియా ముందుకు ‘పుష్ప’.. అరెస్ట్‌పై ఏమన్నారంటే..
Read Latest AP News And Telugu News