బార్‌లా.. తెరిచే ఉంటాయి
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:57 PM
జగన పాలనలో దశల వారీ మద్యనిషేధం బూటకమైంది. ఇక నిబంధనల మేరకు జరగాల్సిన మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా జరిగిపోయాయి. బార్లు, వైనషాపుల టైంకు తెరుచుకుని, టైంలోపే క్లోజ్ చేయాలి. అయితే ఇదేమీ
24 గంటలూ అమ్మకాలు
పేరుకే బార్ అండ్ రెస్టారెంట్.. ఎక్కడా ఫుడ్ లేని వైనం
కళ్లు మూసుకున్న నిఘా నేత్రం
కూటమి అధికారంలోకి వచ్చినా ఆగని బార్ల దందా
(కడప - ఆంధ్రజ్యోతి): జగన పాలనలో దశల వారీ మద్యనిషేధం బూటకమైంది. ఇక నిబంధనల మేరకు జరగాల్సిన మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా జరిగిపోయాయి. బార్లు, వైనషాపుల టైంకు తెరుచుకుని, టైంలోపే క్లోజ్ చేయాలి. అయితే ఇదేమీ జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటినా కూడా సేమ్ టు సేమ్‌గా మద్యం అమ్మకాలు జరుపుతుండడం చూసి జనం అవాక్కవుతున్నారు. కోడి కూయక ముందు పాల ప్యాకెట్ దొరకదేమో కానీ మందు మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. అయితే 10గంటలకు అయితే ఒక రేటు ఉంటే, తెల్లారేసరికి నిద్రలేచేసరికి అంటే కోడి కూడయకముందే అయితే దానికి స్పెషల్ రేటు ఉంటుంది. ఇక జిల్లాలో ప్రభుత్వ మద్యం షాపులకు టైమింగ్ ఉందేమో కానీ బార్లకు మాత్రం నోటైమ్స్, ఎందుకంటే అవి 24గంటలు తెరుచుకుని ఉంటాయి. అంటే మందుబాబు భాషలో చెప్పాలంటే అవి ఆసుపత్రిలాంటివి. అందుకనేమో ఇక్కడ లిక్కర్ అమ్మకాలకు నో టైమింగ్స్. ఎప్పుడు చూసినా మందు దొరుకుతూనే ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అమ్మకాలను చెక్ పెట్టాల్సిన అధికార యంత్రాంగం బార్ల యజమాన్యానికి సలాం చేస్తూ వారి అడుగులకు మడుగులొత్తుతోంది. చంద్రబాబు సీఎం అయినా కూడా వైసీపీ పాలనలో మాదిరిగా మద్యం అమ్మకాలు చూసి జనం అవాక్కవుతున్నారు.
మందుబాబులకు జగన పాలన ఓ విషపు రక్కసిలాంటిది. స్టేట్‌లో ఎన్నో ఏళ్లుగా తాగుతున్న, దొరుకుతున్న మద్యానికి జగన నూతన మద్యం పాలసీ పేరిట వాటికి చెక్ పెట్టేశారు. దశల వారీగా మద్యనిషేధం పేరుతో రకరకాల విన్యాసాలు చేశారు. మందు మాన్పించేందుకే బాటిళ్లను ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా కవరింగ్ ఇచ్చుకున్నారు. మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకునేందుకే ప్రైవేటు షాపులను రద్దు చేసి ప్రభుత్వ మద్యం షాపులను తెచ్చామన్నారు. దేవుడిగుట్టు పూజారులకు ఎరుక అన్నట్లుగా కొత్త మద్యంపాలసీ తరువాత జగన తత్వం బయటపడింది. ఎప్పుడు చూడని, తాగని దరిద్రపు జే బ్రాండ్లను తీసుకువచ్చారు. వాటిని జనాలకు అంటగట్టారు. అయితే ఎప్పుడూ నాలిక రుచి చూడని మందు చూసి మందుబాబులే అవాక్కయ్యారు. అయితే వాటిని తాగాలంటేనే భయపడుతున్న సమయంలో నూతన బార్ల పాలసీని జగన తీసుకువచ్చారు. అయితే ఆ పాలసీ ప్రభుత్వానికి వ్యాపారులకు లాభంగా ఉందే తప్ప మందుబాబులకు లేదు. రెండేళ్లకోసారి బార్లకు అనుమతిచ్చేవారు. అయితే జగన మూడేళ్లకొకసారి అనుమతి పెంచారు. అదే ఇప్పుడు బార్ల యజమానులకు వరంగా మారగా మందుబాబులకు భారంగా మారింది.
జిల్లాలో 27 బార్లు ఉన్నాయి. రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకు విక్రయాలు జరుపుకోవాలి. బార్ల వేలంలో కోట్లు పెట్టి షాపులు దక్కించుకున్నారు. ఇక్కడ మద్యం ధరలపై నియంత్రణ లేదు. అయితే వేలం ప్రకారం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే బార్ల యజమానులు ఎవరినైనా మేనేజ్‌చేయగల సమర్థులు. ఇక్కడ అధికారులు, రాజీకీయ నేతలు మద్యం వ్యాపారులు మిక్స్ కావడంతో మందుబాబుల ఆరోగ్యం కన్నా.. ప్రభుత్వానికి మంచి పేరు కన్నా సొంత ఆదాయమే లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే నిబంధనలను తుంగలో తొక్కారు. రెస్టారెంటు నడిపేవారికే బార్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో 95 శాతం బార్లకు నో రెస్టారెంట్. కేవలం బార్లకు అనుమతి తీసుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే బార్లకు ఉన్న నిబంధనలు నాలుగైదు బార్లకు తప్ప ఎక్కడా ఉండవు. జిల్లా హెడ్‌క్వార్టర్ కడపలో ఉండే 11 బార్లలో బార్‌అండ్ రెస్టారెంట్ ఉండేది ఒకటి రెండు మాత్రమే. మిగతావన్నీ పేర్లకే బార్లు. అవి బెల్టుషాపులతో సమానం. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ అనేసరికి కిచెన, పార్కింగ్, ఇతరత్రా నిబంధనలు అన్నీ ఉండాలి. కడపలో కొన్ని బార్లు చూస్తే కనుక బెల్టుషాపే నయం అన్నంత దరిద్రంగా ఉంటుంది. బయట నుంచి చికెన, ఇతర త్రా తీసుకువచ్చి రెస్టారెంటు పేరుతో మందుబాబులకు అంటగడతారు. ఇంత ఘోరంగా బార్లలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా కూడా అధికార యంత్రాంగం అసలు పట్టించుకోవడం లేదు. నిన్నటిదాకా జగన ప్రభుత్వం, ఇప్పుడు కూటమి వచ్చినా కూడా పట్టించుకోని పరిస్థితి.
నో టైమింగ్స్
మద్యం వ్యాపారం అంటేనే అదో మాఫియా లాంటిదంటారు. వాళ్లు ఎవరినైనా మేనేజ్ చేస్తారంటారు. అందుకే మద్యం సిండికేట్‌పై గుర్తుంచుకునే బ్యాచ అధికారం మారాక పట్టించుకోదు. మద్యనిషేఽధంపై ఫైట్ చేసే సంఘాలు కూడా లైట్ తీసుకుంటాయి. గవర్నమెంటు మారినా కూడా మద్యం మాఫియాదే. సేమ్‌టు సేమ్ హవా నడుస్తోంది. అంటే అప్పుడు ఏం చేశామో ఇప్పుడు అదే చేస్తారంటారు. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మద్యం అమ్మకాల్లో తేడా లేదు. జిల్లాలో 27 బార్లు ఉంటే అవేవీ నిబంధనలు పాటించడం లేదు. పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ ఇప్పటి దాకా 24గంటలు పేరిట అపోలో మెడికల్ షాపు ఉన్నట్లు బోర్డులు కనిపించేవి. అయితే అవి ఏ మాత్రం తెరిచి ఉంటారోతెలియదు కానీ బార్లు మాత్రం తెరిచే ఉంటాయి. ఎప్పుడు ఏం టైం అయినా మందు దొరికుద్ది మొబైల్ యుగం రాక ముందు కోడికూత అనేది దినచర్య. అయితే ఇప్పుడు కోడికూతే ఏమో కానీబార్లు తెరిచే టైం హద్దే ఉండదు. కడపలో అయితే ఎప్పుడయినా సరే మందు దొరుకుద్ది. కడపలో 11 బార్లు ఉంటే పేరుకే బార్ అండ్ రెస్టారెంటు. ఒకటి రెండు బార్లు మినహాయిస్తే మిగతా వాటన్నింటికీ నిబంధనలు నిల్. ఆర్టీసీబస్టాండు, కోటిరెడ్డిసర్కిల్, ఎర్రముక్కపల్లె సర్కిల్, అప్సరసర్కిల్. పొట్టిశ్రీరాములు విగ్రహం, బిల్డప్, చెన్నూరు బ స్టాండు, పాతబస్టాండు, ఐటిఐ సర్కిల్, రాజంపేట బైపా్‌సలో బార్లు ఉన్నాయి. అయితే ఇక్కడ కేవలం రెండు మూడు బార్లకు మాత్రమే రెస్టారెంటు అనుమతి ఉంది. అయితే అక్కడ నిబంధనల మేరకు కిచెన, పార్కింగ్ ఉండాలి. ఉదయం 10గంటల నుంచి రాత్రి 11 వరకు బార్లు తెరుచుకోవాల్సి ఉండగా.. బార్లన్నీ తెల్లవారుజామున 4 నుంచి ఎప్పుడు చూసినా తెరిచే ఉంటాయి. ఓ విధంగా చెప్పాలంటే అసలు మూత వేస్తేకదా అనే విధంగా ఉంది. ఇక మద్యం అవ్మకాలపై దృష్టి పెట్టాల్సిన అఽధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో పట్టించుకోవడంలేదు.