Share News

వైభవంగా సంగమేశ్వరుడి రథోత్సవం

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:44 PM

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లె పాపాఘ్నీ నది ఒడ్డున వెల సిన ప్రసన్న పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి వారి రథోత్సవం కన్నుల పండువగా వైభవంగా నిర్వహించారు.

వైభవంగా సంగమేశ్వరుడి రథోత్సవం
పీలేరు వీధుల్లో విహరిస్తున్న కాశీ విశాలాక్షి, కాశీ విశ్వేశ్వరుడు పీటీఎంలో సంగమేశ్వర స్వామి రథాన్ని లాగుతున్న భక్తులు

పెద్దతిప్పసముద్రం మార్చి 9 : మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లె పాపాఘ్నీ నది ఒడ్డున వెల సిన ప్రసన్న పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి వారి రథోత్సవం కన్నుల పండువగా వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహిం చే ఉత్సవాల్లో బాగంగా మూడవ రోజైన శనివారం ఉదయం ఆల యంలో స్వామి వారికి పంచామృతాభిషేకంతో పాటు స్వామి వారికి విశేషపూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఆలయ దర్మకర్త పీవీ రామాంజనేయరెడ్డి, చెన్నరాయునిపల్లెకు చెందిన మొలక లచెరువు మాజీ మార్కెట్‌ చైర్మన శ్రీనాథ్‌రెడ్డి, పి.రామిరెడ్డి, బొమ్మే వెం కట్రమణప్పల ఆధ్వర్యంలో ప్రసన్న పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను రథంలో కొలువు తీర్చి వేదపండి తుల కైంకర్యములతో శివనామస్మరణలతో మంగళవాయిద్యాలు, చెక్క భజనలు, కోలాటలు, బళ్లారి డ్రమ్స్‌లతో స్వామి వారి రథాన్ని పురవీ ధుల్లో ఊరేగించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రప్ర దేశ రాష్ర్టాల నుచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి రథోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమా న్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా బీసీసెల్‌ అద్యక్షుడు సురేంద్రయాదవ్‌, మనోజ్‌ జయంతరెడ్డి, తంబళ్లపల్లె పోల్‌ మేనేజ్మెం ట్‌ కుడుం శ్రీనివాసులు, మాజీ సింగల్‌ విండో చైర్మన సంపతికోట కిట్టన్న, మండల తెలుగు యువత అధ్యక్షుడు శివ, రాజంపేట బీసి సెల్‌ కార్యదర్శి సూరి, భాస్కర్‌యాదవ్‌, మాజీ జడ్పీటీసీ ఈశ్వరప్ప, టీడీపీ మండల అద్యక్షుడు ఆనంద్‌రెడ్డి, ఈవీ రమణ, బస్సు బయ్యా రెడ్డి, సర్పంచ శారద, ఉపసర్పంచ మధుకర్‌రెడ్డి, సీనియర్‌ బీజేపీ నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మద్గుండాల మల్లేశ్వరుడి దర్శనానికి పోటెత్తిన జనం

పీలేరు, మార్చి 9: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మద్గుండాల మల్లేశ్వరుడి జాతరకు పీలేరుతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు పోటెత్తారు. భక్తులతో అడవిపల్లె అటవీ ప్రాంతం కిటకిటలా డింది. జాతర సందర్భంగా స్వామి వారికి శనివారం వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సంతాన లేమితో బాధపడుతున్న మహిళలు శుక్రవారం రాత్రి ఆలయం వద్దనే జాగారణ చేసి ఆలయ సమీపంలోని ఝరిలో పవిత్ర స్నానమాచరించి శనివారం ఉదయం స్వామి ఎదుట వరపడ్డారు. అడవిపల్లె, తలపుల, రేగళ్లు, కేవీపల్లె మండలంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన దేవరెద్దులు, గొడుగులు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతర కోసం వచ్చిన వారి కోసం తలపుల, పీలేరు ఆర్యవైశ్య సంఘంతోపాటు వివిధ సంఘాలు, ప్రైవేటు వ్యక్తులు ఆలయ పరిసరాల్లో పెద్దఎత్తున అన్న దానం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన్లు నిర్మించి స్వామి వారి దర్శనం త్వరితగతిన జరిగేలా చూశారు. పీలేరు అర్బన సీఐ మోహన రెడ్డి, ఎస్‌ఐ నరసింహుడు ఆధ్వర్యంలో ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అటవీ ప్రాంతం కావడంతో ఎటువంటి అగ్నిప్రమాదాలు జరగకుండా పీలేరు అటవీ శాఖ రేంజర్‌ రామ్లా నాయక్‌ నేతృత్వంలో సిబ్బంది పహరా కాశారు. తలపుల పీహెచసీ సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. మరోవైపు పీలేరు పట్టణంలో విశాలాక్షి, కాశీ విశ్వేశ్వరుడు పీలేరు ప్రధాన వీధుల్లో విహరించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన త్రిశూలానికి మదనపల్లె మార్గంలోని చెన్నకే శవ స్వామి ఆలయం వద్ద శాస్ర్తోక్తంగా పవిత్ర స్నానం నిర్వహిం చారు. అనంతరం ఆలయంలో స్వామి, అమ్మవారికి డోలోత్సవం నిర్వ హించారు. శివరాత్రి సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు విజయ్‌ కుమార్‌ నిర్వహించిన సంగీత కచేరి ఆహుతులను ఆకట్టుకుంది. శివరామపురంలోని భ్రమరాంబ మల్లిఖార్జునుడికి శనివారం ఉదయం ఝరిస్నానం, షోడపచార పూజలు నిర్వహించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆయా ఆలయాల ఉత్సవ కమిటీ సభ్యులు వారణాశి మోహన రెడ్డి, సభ్యులు సుధాకర, విజయ్‌ కుమార్‌, సుమన, ఆటో బాషా, చానబాషా, ఉద్యా ఫణీంద్రశర్మ, మయూర్‌నాథ శర్మ, వెంకటరమణ నాయునివారు, మల్లిఖార్జున రెడ్డి, సందీప్‌ రెడ్డి, ఆంజనేయులు, అర్చకులు విరూపాక్షం కుమారస్వామి, సూత్రం కిరణ్‌ కుమార్‌, గౌతమ్‌, పవన, వినయ్‌, విరూపాక్షం శ్రీనివాస శాస్ర్తి, విశ్వనాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు

మదనపల్లె అర్బన, మార్చి 9: పట్టణంలో మహాశివరాత్రి ఉత్సవాలు శనివారంతో అత్యంత వైభవంగా ముగిసాయి. చిప్పిలి మడికయ్యల శివాలయంలో యోగభోగేశ్వరుడికి, వల్లిదేవసేనా సమేత సుబ్రహ్మణ్యం స్వామి వార్లకు విశేష అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త మార్పురి సుధా కర్‌నాయుడు,చైన్నైలోని ప్రశాంత మల్టీ స్పెషాలిటీ హాస్పిల్‌ నిర్వహ కులు డాక్టర్లు ఎం.యశస్విరాజ్‌, సాయిసంహిత, విజయశ్రీ, డాక్టర్‌ మార్పురిశ్రీదేవి, ఎం.మురఽళీధర్‌ పాల్గొన్నారు. దేవళంవీధిలోని సోమేశ్వ రస్వామి ఆలయంలో స్వామివారికి శయనోత్సం నిర్వహించారు. నీరు గట్టువారిపల్లెలోని నీలకంఠేశ్వరుడికి రాష్ట్ర కురబ కార్పొరేషన డైరెక్టర్‌ దండురామాంజులు, వెంకటనాగులమ్మ, వెంటరమణ, దండు ఆనంద్‌, ఆలయధర్మకర్త గుడి రామాంజులు, శివశంకర్‌, ఆధ్వర్యంలో అన్నదాన ం నిర్వహించారు. అంతకముందే ఆలయంలోని నీలకంఠేశ్వరుడికి ఆలయ అర్చకులు శయనోత్సం నిర్వహించారు. పట్టణంలోని ఆర్యవైశ్య హాస్టల్‌ శుక్రవారం రాత్రి శివపార్వతుల కల్యాణం కమనీయంగా జరి గింది. ఈ కార్యక్రమాన్ని మదనపల్లె ఆర్యవైశ్య సంఘంపట్టణ అధ్యక్షు డు పూనగంటి ఓంప్రకాష్‌, కమిటీ సభ్యులు, వాసవీక్లబ్‌ సభ్యులు శ్రీనాథ్‌, పి, అమరపాథ్‌, లక్ష్మీదీఫక్‌, వీవీకృష్ణారావు, వాసవీ మహిళ వనితాక్లబ్‌ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్యవైశ్యలు అధిక సంఖ్యలో స్వామివారి కల్యాణంలో పాల్గొని భక్తులకు అన్న సంతర్పణ చేశారు. కనకాదస్‌ నగర్‌ కాలనీ సమీపంలోని సిద్దలింగేశ్వరస్వామికి శనివారం ఉదయం పార్వతీ, పరమేశ్వర కల్యాణం నిర్వహించారు.

వాల్మీకిపురంలో:మహాశివరాత్రి సందర్భంగా వీరన్నకొండపై వెలసిన వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొం ది. ఈసందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ధర్మపథం సమూహాలయంలో లింగోద్భవ మహాశివుడికి, కోనేటివీధిలో వెలసిన శివాలయంలో కామేశ్వరస్వామికి అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. వేలాది భక్తజనం నడుమ ఆలయాలలో శివ పార్వతుల కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించి తీర్థప్రసాద, అన్న వితరణ చేపట్టారు. కార్యక్రమంలో అర్చకులు సాలిగ్రామ శ్రీని వాసాచార్యులు, ఆలయాల ధర్మకర్తలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నేలమల్లేశ్వరస్వామి ఆలయంలో పగటి తిరుణాళ్ల

నిమ్మనపల్లి, మార్చి 9: మండలంలోని తవళం పంచాయతి అటవీ ప్రాతం బాహుదా ఉపనది కుమారస్వామి పశ్చిమ భాగాన వెలసిన నేలమల్లేశ్వరస్వామి ఆలయంలో శనివారం పగటి తిరుణాళ్లకు అధిక సంఖ్యంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకొన్నారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తుల కొరకు సర్పంచ రెడ్డెప్ప, దాత రెడ్డెప్పరెడ్డిలు అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే భక్తుల సౌకర్యార్ధం గుడి వద్దకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.

వైభవంగా వీరభద్రస్వామి తిరుణాల

ములకలచెరువు, మార్చి 9: మండలంలోని కోనేటివారిపల్లె పంచా యతీ బత్తినివారిపల్లెలో శనివారం వీరభద్రస్వామి తిరుణాల ఉత్సవం వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది శివరాత్రి పండగ మరుసటి రోజు వీరభద్రస్వామి తిరుణాల ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోం ది. ఈ సందర్భంగా స్వామి వారి ప్రతికగా భావించే గొడుగును పూల తో ముస్తాబించి గ్రామంలో ఘనంగా ఊరేగించారు.

Updated Date - Mar 09 , 2024 | 11:44 PM