ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:19 AM
ప్రజా సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.
మదనపల్లె టౌన, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. శుక్రవారం మండ లంలోని కొత్తవారిపల్లెలో సర్పంచ మహేష్ అధ్యక్ష తన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, పాసుపుస్త కాలు, సర్వే, అడంగల్ తదితర రెవెన్యూ సమస్య లు పరిష్కరించేందుకు ప్రజల ముంగిటకే అధికా రులు వచ్చారన్నారు. ఇక్కడ ఇచ్చే ప్రతి అర్జీకి జవాబుదారితనంతో పరిష్కార మార్గం దొరుకు తుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ కొత్తవారిపల్లె గ్రామానికి శ్మశాన వాటిక లేదని దీని వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే గ్రామంలో మౌలి క వసతులు కల్పించాలని కోరారు. సాయంత్రం వరకు మొత్తం 79 మంది వివిఽధ సమస్యలపై రెవె న్యూ సదస్సులో అర్జీలు అందజేశారు. ఈ కార్యక్ర మంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర, డీఎల్‌డీవో అమరనాథరెడ్డి, తహసీల్దార్ ఖాజాభీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
నిమ్మనపల్లిలో: మండలంలో నెలకొన్న భూ సమ స్యలను సత్వరపరిష్కారం కొరకే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహానబా షా, ప్రత్యేక అధికారి, డీపీవో బాలకృష్ణారెడిల్డు పేర్కొన్నారు. శుక్రవారం వెంగంవారిపల్లి గ్రామ పంచాయతిలో రెవెన్యూ గ్రామ సభ నిర్వహించా రు. అనంతరం రెవెన్యూ గ్రామ సభలో 155 వర కు వివిధ అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ ధనంజే యులు తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటరయణ, టీడీపీ అధికార ప్రనిధి ఆర్జే వెంకటేష్, నాయకులు సుధాకర్‌రావు, మల్లికా ర్జున, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక
గుర్రంకొండ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి):రైతులు భూ సమస్యలను పరిష్కరించుకోవడానికి రెవెన్యూ సదస్సులు మంచి పరిష్కార మార్గాలను చూపుతా యని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని టి.పసలవాండ్లపల్లె గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందన్నా రు. రైతుల భూములను తారుమారు చేసి చాలా మంది రైతులను వైసీపీ నాయకులు ఇబ్బందులకు గురిచేశారని అలాంటి సమస్యలను ఈ సదస్సుల్లో పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం ప్రజలు, రైతులను నుంచి ఆర్జీలను స్వీకరిం చారు. ఇందు లో మొదటి రోజు వివిధ సమస్యలపై 41 ఆర్జీలు వచ్చినట్లు ప్రత్యేకాధికారి లక్ష్మీపతి తెలి పారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో వెంకటేశులు, వీఆర్వోలు, నాయకులు పాల్గొన్నారు.
రైతు సదస్సులోని ప్రతి అర్జీ పరిష్కారం
పెద్దమండ్యం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి) ప్రతిష్టా త్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సద స్సులలో రైతుల నుంచి వచ్చిన అర్జీలు పరిష్కరి స్తామని పెద్దమండ్యం నోడల్ అధికారి, జిల్లా హౌసింగ్ పీడీ సాంబశివ పేర్కొన్నారు. మండలం లోని వెలిగల్లులో శుక్రవారం జరిగిన రైతు సదస్సు లో రెవెన్యూకు సంబంధించి 85 అర్జీలు రాగా, ఇతర శాఖలవి 11 అర్జీలు వచ్చాయి. అనలైన, భూసర్వే, దారి సమస్యలు, రేషనకార్డులు తదితర వాటిపై అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సయ్యద్‌ఆహ్మద్, ఎంపీ ఎంపీటీసీ సభ్యురాలు నరసమ్మ కూటమి నేతలు మాజీ సర్పంచ క్రిష్ణారెడ్డి, జిల్లా టీడీపీ మాజీ ఉపాఽధ్యక్షుడు విశ్వనాధరెడ్డి, రామాంజులునాయు డు, రామాంజులు, రసూల్, కాలేషా, సాంబశివ గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దతిప్పసముద్రంలో : గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సభలను ఏర్పాటు చేసి నట్లు నోడల్ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం సుబ్రమణ్యం పేర్కొన్నారు. శుక్రవా రం మండలంలోని అమ్మళ్లబండకోటలో తహసీ ల్దార్ శ్రీరాములునాయక్ ఆధ్యర్యంలో గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ గ్రామసభలో ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని ఆనలైన చేసి రైతులకు రసీదు ను ఇచ్చారు. గ్రామంలో రెవెన్యూ సమస్యలపై 9 అర్జీలు, పెన్షన్లకు సంబందించి 3 అర్జీలు, మంచి నీటి సమస్య కోసం ఒకటి, దారిసమస్యను కోరు తూ ఒక అర్జీ అందినట్లు తహసీల్దార్ తెలిపారు. స్థానిక సర్పంచ శ్రీకంఠరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ విద్యాసాగర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోండి
బి.కొత్తకోట, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు. శుక్రవా రం బి.కొత్తకోట మండలంలోని బీరంగి గ్రామంలో జరిగిన రెవెన్యూసదస్సులో ఆయన పాల్గొని రైతు ల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. గ్రామ సమీపంలో ఉన్న 7.50 ఎకరాల ఏటిపొరంబోకు స్థలంలో సింగిల్‌విండో గిడ్డంగుల కోసం కైటాయిం చాలని భావిస్తున్న 2 ఎకరాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సదస్సులో వివిధ భూసమ స్యలపై 51 మంది రైతులు అర్జీలు ఇచ్చుకున్నారు. కార్యక్ర మంలో తహశీల్దార్ మహమ్మద్ అన్సారీ, రెవిన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ములకలచెరువులో: ప్రజా సమస్యల పరిష్కారా నికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మదన పల్లె ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, మండల నోడల్ ఆఫీ సర్ రషీద్‌ఖాన, తహసీల్దార్ ప్రదీప్ పేర్కొన్నారు. మండలంలోని సెంట్రల్ స్కూల్‌లో శుక్రవారం రెవె న్యూ సదస్సులో మొత్తం 36 ఆర్జీలు వచ్చాయ న్నారు. ఇందులో 32 రెవెన్యూ సమస్యలు, నాలు గు ఇతర సమస్యలపై ప్రజలు వినతులు అందజే శారు. ఈ సదస్సులో ఎండీపీవో హరినారాణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తొలి సదస్సులో 103 దరఖాస్తులు
పీలేరు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సద స్సుల్లో భాగంగా శుక్రవారం పీలేరు మండలం మేళ్లచెరువు గ్రామంలో జరిగిన గ్రామసభలో ప్రజల నుంచి 103 దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఇరిగేషన శాఖ ఈఈ భరత కుమార్, తహసీల్దారు భీమే శ్వర రావు, డీటీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.