Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:22 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే క్రిష్ణచైతన్యరెడ్డి

కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి

కమలాపురం రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఏడీఏ కార్యాలయ ఆవరణంలో ఏడీఏ నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన డ్రిప్‌ ఇరిగేషన పరికరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆ నేలకు అవసరైన నీరు, పోషక పదార్ధాలు అందినప్పుడే మంచి పంటలు పండి దిగుబడి అధికంగా వస్తుందన్నారు. సన్న, చిన్న కారు రైతులు ఐదు ఎకరాల లోపు వారికి 90 శాతం సబ్సిడీతోనూ, ఐదు ఎకరాలు పైన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ రైతులకు 70శాతం సబ్సిడీతో ఈ పరికరాలను అందిస్తున్నామన్నారు. కమలాపురం ని యోజకవర్గం కరువు ప్రాంతం కాబట్టి ముం దుగా ఈ ప్రాంతంలో రైతులకు పరికరాలు పంపిణీ చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన అనుమతించారన్నారు. పరికరాలు అందని వారు ఆనలైనలో నమోదు చేయించుకోవాలన్నారు. వారికి కూడా 15 రోజుల్లో డ్రిప్‌ పరికరాలు అందే విధంగా చూస్తామన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:22 AM